Nagarjuna In Japan: నాగు సామ.. జపాన్‌లో నాగార్జున రేంజ్‌తెలిస్తే షాకే
ABN, Publish Date - Aug 01 , 2025 | 01:02 PM
బాహుబలి, RRR వంటి సినిమాల రాకతో ఇండియానే కాదు ప్రపంచ వ్యాప్తగా భారతీయ సినిమా ఘనత ఘనంగా ప్రజ్వరిల్లుతున్న విషయం తెలిసిందే.
బాహుబలి, RRR వంటి సినిమాల రాకతో ఇండియానే కాదు ప్రపంచ వ్యాప్తగా భారతీయ సినిమా ఘనత ఘనంగా ప్రజ్వరిల్లుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే అనేక దేశాల ప్రజులు చెవి కోసుకుంటున్నారు. మరీ ప్రధానంగా జపాన్‌లో అయితే తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చేసూ వారు వేలల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రజనీ కాంత్, జూ. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి వంటి స్టార్లకు బయటి దేశాల్లో అదిరిపోయే క్రేజ్ ఉంది. ఆ మధ్య దేవర ప్రమోషన్స్ సమయంలో ఎన్టీఆర్ జపాన్‌కు వెళ్లినప్పడు అక్కడి ప్రజలు చూయించిన ఆప్యాయతకు ఫిదా అయిపోయాడు. ఇప్పుడు ఆ లిస్టులో మన కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) కూడా చేరిపోయాడు. ఇది చదువుతున్న వారికి ఏంటీ నాగార్జునకు అక్కడ అభిమానులు ఏంటి, ఆయన సినమాలు అక్కడ ఒక్కటి కూడా విడుదల కాలేదు కదా అని అందరికీ డౌటనుమానాలు రావచ్చు.
వివరాల్లోకి వెళితే ఐదేండ్ల క్రితం రణభీర్ కపూర్, అలియా భట్ జంటగా వచ్చిన భారీ చిత్రం బ్రహ్మాస్త (Brahmastra). ఆ సినిమాలో నాగార్జున (Akkineni Nagarjuna) సూపర్ వపర్స్ ఉన్న నంది అనే ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం నాడు జపాన్‌లో విడుదలై అక్కడ విజయం సాధించింది. దీంతో హీరో హీరోయున్లతో పాటు నాగార్జున పాత్ర అక్కడి ప్రజలకు విశేషంగా కనెక్ట్ అయిపోయారు. క్రమంగా ఆయన పాత చిత్రాలను చూస్తూ అనేక మంది నాగ్ అభిమానులుగా మారారు. ఇటీవల కుబేర సినిమా ఓటీటీలో రిలీజ్ అవగా చిత్రాన్ని చూసిన అక్కడి ఫ్యాన్స్ నాగ్ సామ అంటూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు సైతం బాగా వైరల్ అయ్యాయి.
అయితే.. జపాన్ దేశంలో ఎదుటి వారిని గౌరవించే క్రమంలో సామ అంటారు. మన దేశంలో ఎదుటి వారిని పేరు పెట్టి పిలిచే సమయంలో చివర గారు, అండీ, సార్ అని ఎలా సంబోధిస్తామో వారు సైతం అవతలి వారిని పిలిచే క్రమంలో కొంతమందికి మాత్రమే తమ సాంప్రదాయం ప్రకారం సామ అంటూ పిలిచి తమ గౌరవం తెలియజేస్తారు. అదీ కూడా వారు కేవలం వారి దేవుళ్లను, రాజులను, గొప్పవాళ్లను అలా సామ పేరుతో పిలిచి సత్కరిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కుబేర (Kubera) సినిమాలో నాగార్జున నటను చూసిన జపాన్ అభిమానులు నాగ్‌ను నాగ్ సామ అంటూ తమ అప్యాయతను, గౌరవాన్ని ప్రదర్శించారు. ఈ వార్త విని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని అక్కినేని అభిమానులుగకర్వంగా కాలర్ ఎగుర వేస్తు తమ హీరో గొప్పతనం గురించి సామాజిక మధ్యమాల్లో సంతోషంగా పోస్టులు పెడుతున్నారు.