సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nag Ashwin: జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు.. కౌంటర్‌ దీపికకేనా..

ABN, Publish Date - Sep 19 , 2025 | 05:17 PM

‘కల్కి 2’ (Kalki 2) సినిమా నుంచి బాలీవుడ్‌ నటి దీపిక (Deepika Padukone) తప్పుకొన్నారన్న విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

‘కల్కి 2’ (Kalki 2) సినిమా నుంచి బాలీవుడ్‌ నటి దీపిక (Deepika Padukone) తప్పుకొన్నారన్న విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా దీపికాకు సంబంధించిన పోస్ట్‌లు, వార్తలే దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin) షేర్‌ చేసిన ఓ పోస్ట్‌, దాని క్యాప్షన్‌ చర్చనీయాంశంగా మారాయి.

‘కల్కి 2898 ఏడీ’లో కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను నాగ్‌ అశ్విన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. అందులో ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే..’ అని అశ్వత్థామకు కృష్ణుడు చెప్పే డైలాగ్ ఉంది. దీన్ని షేర్‌ చేస్తూ ఆయన ఓ ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టారు. ‘జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు. కానీ, తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ నటి దీపికను ఉద్దేశించే అని నెటిజన్లు భావిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో లేకపోవడం వల్ల రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అందుకు రెమ్యునరేషన్‌ ఓ కారణమని, ఆ కారణంగానే ఆమెను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.


దీపికను సపోర్ట్‌ చేస్తూ ఆమె అభిమానులు వరుసగా పోస్టులు పెడుతున్నారు. వాటిని తిప్పికొడుతూ ప్రభాస్‌ అభిమానలు విమర్శిస్తూ రిప్లై ఇస్తున్నారు. ఇప్పుడు దీపిక స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ‘కల్కి’ సీక్వెల్‌లో దీపిక స్థానంలో ఎవరోస్తారోననేది కూడా ఆసక్తిగా మారింది. ఆమె తప్ప సుమతి పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరని నెటిజన్లు అంటున్నారు.   

Updated Date - Sep 19 , 2025 | 05:55 PM