Naga Durga: నాగ‌దుర్గ‌.. కొత్త బోనాల పాట వ‌చ్చింది

ABN , Publish Date - Jul 20 , 2025 | 08:16 PM

తెలంగాణ‌లో జాన‌ప‌ద పాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన నాగ‌దుర్గ న‌టించిన మ‌రో కొత్త పాట విడుద‌లైంది.

Naga Durga

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ముఖ్యంగా తెలంగాణ‌లో జాన‌ప‌ద పాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన నాగ‌దుర్గ (Naga Durga) న‌టించిన మ‌రో కొత్త పాట విడుద‌లైంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో బోనాల ఉత్స‌వాలు జోరుగా సాగుతుండ‌డంతో ఇప్ప‌టికే ప‌దుల‌ మంది క‌ళాకారులు అనేక పాటలు విడుద‌ల చేశారు. ఈక్ర‌మంలో.. ఇప్ప‌టికే నాగ దుర్గ న‌టించి, న‌ర్తించిన ఓ అర డ‌జ‌న్ పాటలు రిలీజ్ అయి ఓ ఊపు ఊపుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో.. తాజాగా న‌డి నెత్తిన బోనం (Nadi Nettina Boname) అంటూ సాగే మ‌రో పాట‌ను విడుద‌ల అయింది. ఈ పాట‌కు సంతోష్ షేరి (Santhosh Sheri) సాహిత్యం అందించ‌గా మ‌దీన్ (Madeen SK) సంగీతంలో వాగ్దేవి (Vagdevi) ఆల‌పించింది. శేఖ‌ర్ వైర‌స్ నృత్య రీతులు స‌మ‌కూర్చారు. ప్ర‌స్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Jul 20 , 2025 | 08:16 PM