Vidya Balan: డర్టీ పిక్చర్ భామ.. ఇంకా అంతే ఘాటుగా చూపిస్తుందే
ABN , Publish Date - Jul 15 , 2025 | 10:06 PM
బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్(Vidya Balan) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం , అభినయం కలబోసిన నటీమణుల్లో విద్యా బాలన్ మొదటి వరుసలో ఉంటుంది.
Vidya Balan: బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్(Vidya Balan) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం , అభినయం కలబోసిన నటీమణుల్లో విద్యా బాలన్ మొదటి వరుసలో ఉంటుంది. అందాలను ఆరబోసి మత్తెక్కించాలన్నా.. నిండుగా కప్పుకొని కన్నీళ్లు పెట్టించాలన్నా.. దెయ్యంగా మారి భయపెట్టాలన్నా కూడా ఆమెకే చెల్లింది. బాలీవుడ్ లో విలక్షణ నటీమణుల్లో విద్యా కూడా ఒకరు. తెలుగులో కూడా ఈ చిన్నది పలు సినిమాలు చేసింది. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన కథానాయకుడులో బాలకృష్ణ సరసన బసవ తారకంలా కనిపించింది విద్యా బాలనే. ఆ పాత్రలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు.
ఇక కథానాయకుడు కన్నా ముందు డర్టీ పిక్చర్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది విద్యా బాలన్. అందాల హాట్ భామ సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యా బాలన్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కెరీర్ లో ఆమె ఎన్ని సినిమాలు నటించినా డర్టీ పిక్చర్ ను మించిన సినిమా ఇంకొకటి రాదు అనే చెప్పాలి. ఉల్లాల్లా.. ఉల్లాల్లా సాంగ్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
సినిమాల విషయం పక్కన పెడితే.. విద్య బాలన్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఎంత పద్దతిగా ఉంటుందో.. కొన్నిసార్లు అంతే హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈవెంట్స్ లో చీర కట్టుతో అచ్చతెలుగందం లో కనిపించే విద్యా.. తాజాగా ఒక మ్యాగజైన్ కోసం అందాలను ఆరబోసింది. పీకాక్ మ్యాగజైన్ పై క్లివేజ్ షో చేస్తూ కైపెక్కించింది. పింక్ కలర్ డిజైనర్ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోసి.. కుర్రకారును మత్తెక్కించింది. 46 ఏళ్ల వయస్సులో కూడా విద్యా బాలన్ ఈ రేంజ్ లో అందాలను ఆరబోయడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Meher Ramesh: పవన్ తో సినిమా.. జనాల్ని చంపేస్తావా
Kingdom Second Single Promo: అన్నదమ్ముల అనుబంధం.. మరో చార్ట్ బస్టర్ అయ్యేలా ఉందే