Mayukham Launched: పౌరాణిక మయూఖం
ABN, Publish Date - Aug 30 , 2025 | 04:09 AM
కుశలవ్, తన్మయి హీరో, హీరోయిన్లుగా వెంకట్ బులెమోని దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా మయూఖం...
కుశలవ్, తన్మయి హీరో, హీరోయిన్లుగా వెంకట్ బులెమోని దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘మయూఖం’. పూజా కార్యక్రమాలతో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ బేనర్‌పై శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ సంస్థ ప్రతినిధి ప్రియాంక మన్యాల్ క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.