సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bad Boy Karthik: హ‌రీష్ జ‌య‌రాజ్.. మైడియ‌ర్ జ‌న‌తా లిరిక‌ల్ వీడియో

ABN, Publish Date - Aug 27 , 2025 | 02:54 PM

చాలా విరామం త‌ర్వాత హీరో నాగ‌శౌర్య న‌టిస్తోన్న నూత‌న చిత్రం బ్యాడ్‌బాయ్ కార్తీక్.

Bad Boy Karthik

చాలా విరామం త‌ర్వాత హీరో నాగ‌శౌర్య (Naga Shaurya) న‌టిస్తోన్న నూత‌న చిత్రం బ్యాడ్‌బాయ్ కార్తీక్ (Bad Boy Karthik). విధి యాద‌వ్ క‌థానాయుక‌. సముద్ర‌ఖని (Samuthirakani), నరేశ్‌ విజయకృష్ణ, సాయికుమార్, 'వెన్నెల' కిశోర్, మైమ్ గోపీ, శ్రీదేవి విజయ్ కుమార్ (Sridevi Vijaykumar) తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రామ్ దేశినా (రమేశ్‌) డైరెక్షన్ వ‌హించ‌గా శ్రీనివాసరావు చింతలపూడి (Srinivasarao Chinthalapudi) నిర్మించారు. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ జ‌య‌రాజ్ (Harris Jayraj) సంగీతం అందించాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌ల ఏసిన పోస్ట‌ర్లు, పాట సినిమాపై మంచి హైప్‌ తీసుకు వ‌చ్చింది. అయితే గ‌ణేశ్ చ‌తుర్ధిని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం ఈ చిత్రం నుంచి మై డియ‌ర్ జ‌న‌తా (My Dear Janathaa Lyrical Video) అంటూ సాగే ఫాస్ట్ బీట్ డ్యాన్స్ నంబ‌ర్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

రామ జోగ‌య్య శాస్త్రీ (Ramajogayya Sastry) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా హేమ‌చంద్ర (Hema chandra) ఆల‌పించాడు. కాగా ఈ పాట ఇప్ప‌టికే టాలీవుడ్ మ‌రిచిపోయిన ఇంట్రో సాంగ్స్ ను గుర్తు చేసేలా చిత్రీక‌ర‌ణ ఉంది. పాట అసాంతం హీరో వ్య‌క్తిత్వాన్ని, పాత్ర తీరు తెన్నుల‌ను గొప్ప‌గా చెబుతూ సాగుతూ గ‌తంలో మ‌నం విన్న టాప్ స్టార్ల గీతాల‌ను జ్ఞ‌ప్తికి తెస్తుంది.

Updated Date - Aug 27 , 2025 | 02:55 PM