సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai abhyankkar: బన్నీ కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫస్ట్‌ సాంగ్‌ ఎలా ఉందంటే..

ABN, Publish Date - Aug 30 , 2025 | 03:30 PM

అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న 'AA22XA6' చిత్రానికి  యువ సంగీత కెరటం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అయన తొలి ఫీచర్ సినిమా సాంగ్ బయటికొచ్చింది 

యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ (Sai abhyankkar) కవర్‌సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎ.ఆర్‌.రహమాన్‌, అనిరుద్‌ లాంటి సంగీత దర్శకుల వద్ద సింగర్‌గా, కీ బోర్డ్‌ ప్రొగ్రామర్‌ పని చేసిన ఆయన ఆ క్రేజ్‌తో ఇప్పుడు మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాలకు సంగీతం అందించే అవకాశం అందుకున్నారు. తమిళంలో వరుసగా బాల్టీ, డ్యూడ్‌, కరుప్పు, బెంజ్‌, ఎస్‌టీఆర్‌ 49 వంటి స్టార్‌ హీరోలు నటిస్తున్న చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం 'AA22XA6' (Allu Arjun 26) చిత్రానికి అతనే సంగీత దర్శకుడు. 20 ఏళ్ల వయసులో కేవలం కవర్‌ సాంగ్స్‌తో మెప్పించి అరడజనుకు పైగా స్టార్‌ హీరోల చిత్రాలకు అవకాశం అందుకోవడం అన్నది అతని ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి.  

ఇప్పటి దాకా అతని కవర్‌ సాంగ్స్‌నే సంగీత ప్రియులు విన్నారు. ఇప్పుడు అతని ఫీచర్‌ సినిమా సాంగ్‌ బయటకొచ్చింది. ఆయన సంగీతం అందించిన ‘డ్యూడ్‌’ (DUde) చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. ప్రదీప్‌ రంగనాథన్‌, మమితా బైజు జంటగా నటిస్తున్న చిత్రమిది. కీర్తిస్వరన్‌ దర్శకుడు. ఈ చిత్రం నుంచి ‘బూమ్‌ బూమ్‌’ అంటూ సాగే పాట విడుదలైంది. ఈ సాంగ్‌ వినగానే ఆకట్టుకునేలా ఉన్నా.. ఎందుకో అంతగా పాపులర్‌ కాలేదు. దాంతో మిశ్రమ స్పందనకే పరిమితమైంది.

సాయి అభ్యంకర్‌ ఇప్పటికే ‘ఆసా కూడా’, ‘సిత్రా పుత్తిరి’, ‘విజిల్‌ వీకురా’ వంటి పాటలతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నారు. యూట్యూబ్‌లో లక్షల్లో వీక్షించారు. అయితే ఇవన్నీ కవర్‌ సాంగ్స్‌. ఫీచర్‌ సినిమాకు వచ్చేసరికి అతని పాట ఎందుకో జనాల్ని ఆకట్టుకోలేదు. ఇప్పుడు బన్నీతో భారీ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడు సాయి అభ్యంకర్‌. ఆ సినిమాకు ఎలాంటి అవుట్‌పుట్‌ ఇస్తాడనే భయం అభిమానుల్లో నెలకొంది. కొందరు మాత్రం ఒక్కపాటతో సంగీత దర్శకుడిని అంచనా వేయడం కరెక్ట్‌ కాదని, టాలెంట్‌ లేనిదే ఇరవై ఏళ్ల కుర్రాడు వరుసగా అరడజనుకు పైగా సినిమాలకు అవకాశం ఎలా అందుకుంటాడని సాయి అభ్యంకర్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఫీచర్‌ సినిమాకు వచ్చే సరికి ఈ యువ సంగీత దర్శకుడి సామర్థ్యం ఎలా ఉంటుందో చూడాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.   

Updated Date - Aug 30 , 2025 | 03:34 PM