సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gopala Krishna: క్రమశిక్షణ, అంకితభావం 'లక్ష్మణరేఖ'గా ముందుకు...

ABN, Publish Date - Sep 14 , 2025 | 03:06 PM

మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన 'లక్ష్మణ రేఖ' సినిమా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు గోపాలకృష్ణతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులను సత్కరించారు.

Lakshmana Rekha movie 50 Yerars Celebrations

ప్రముఖ నటుడు మురళీమోహన్, జయసుధ జంటగా నటించిన చిత్రం 'లక్ష్మణరేఖ'. ఈ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకను తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గోపాలకృష్ణ, మురళీమోహన్, జయసుధ తో పాటు కో-డైరెక్టర్ గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ ను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా వీరంతా ఆ సినిమా మేకింగ్ నాటి రోజులకు వెళ్ళిపోయారు. ఆ సమయంలో జరిగిన సంఘటనలను తలుచుకుని ఆనందించారు. క్రమశిక్షణ, అంకిత భావాలను లక్ష్మణరేఖగా మలుచుకుని ఐదు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నామని మురళీమోహన్, జయసుధ తెలిపారు. ఈ వేడుకలో సీనియర్ దర్శకులు ధవళ సత్యం, పి.ఎన్. రామచంద్రరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, ఫిలిమ్ నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కాజా సూర్యనారాయణ, సీనియర్ జర్నలిస్టులు సురేశ్ కొండేటి, అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Also Read: Gaurav Bora: 'మిరాయ్'లో శ్రీరాముడితనే...

Also Read: Vijay Antony: భద్రకాళి.. స్టోరీ మొద‌ట నాకే అర్థం కాలేదు

Updated Date - Sep 14 , 2025 | 03:33 PM