Monica: కూలీ నుంచి.. మౌనిక ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 11 , 2025 | 07:33 PM
రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా.. మై డియర్ మోనికా.. లవ్ యూ మోనికా పూర్తి వీడియో సాంగ్ వచ్చేసింది.
నెల రోజులుగా దేశాన్ని కుదిపేసిన, ఇప్పటికీ ఊపేస్తున్న రజనీకాంత్ (Rajinikanth) కూలీ (COOLIE) సినిమాలోని మోనికా.. మై డియర్ మోనికా (Monica ).. లవ్ యూ మోనికా పూర్తి వీడియో సాంగ్ యూట్యూబ్‌కు వచ్చేసింది. అంతకు ముందు లిరికల్‌గా వచ్చిన ఈ పాట సంచలనం సృష్టించగా కేవలం ఈ పాట కోసమే ప్రత్యేకంగా సినిమా థియేటర్లకు పోయిన వారు చాలామంది ఉన్నారు.
అలాంటి ఈ పాట తాజాగా గురువారం సన్ పిక్టర్స్ (Sun Pictures) యూట్యూబ్ ఫ్లాట్ ఫైంకి వచ్చేసింది. కృష్ణకాంత్ ( Krishna Kanth) సాహిత్యం అందించిన ఈ పాటకు అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. పాట గతంలో విడుదలైన తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని ఆలిండియా వైడ్‌గా దుమ్ము దులిపేసింది. ఎక్కడ విన్నా, చూసినా ఈ పాటే దర్శనమిస్తూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.
అయితే.. ఈ పాట ట్యూన్ పరంగా ఎంతటి బజ్ తెచ్చుకుందో అంతకుమించి షౌబిన్ షాహిర్ డ్యాన్స్ , స్టెప్పులు అంతకుమించి క్రేజ్ తెచ్చుకున్నాయి. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagara)కు తనకు ఇష్టమైన హాలీవుడ్ నటి, మోడల్ మోనికా బెల్లూచిని ప్రేరణగా తీసుకుని ఈ పాటను క్రియేట్ చేయగా పూజా హెగ్డే (Pooja Hegde) వంటి స్టార్ ఈ ప్రత్యేక గీతం చేసినప్పటికీ క్రెడిట్ అంతా షౌబిన్‌కే దక్కడం విశేషం. ఇదిలాఉంటే.. ఈ పాట గురువారం అలా రిలీజ్ అయిందో లేదో గంట లోపే మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించు కోవడం విశేషం.