Mohan Babu: మోహన్ బాబు మాస్ కంబ్యాక్

ABN , Publish Date - Nov 12 , 2025 | 06:49 PM

డైలాగ్ లతో దుమ్మురేపే నటుడు ఆయన! బాక్సాఫీస్ లో ఆయన డైలాగ్స్ కు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఒకప్పుడు మాటలతోనే మాస్ ను ఆకట్టుకున్న ఆ హీరో.. మధ్యలో కాస్తంత స్లో అయిపోయాడు. ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం మళ్లీ రెడీ అవుతున్నాడు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) నటుడిగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. కొన్నాళ్లుగా సొంత సినిమాల్లో తప్ప.. ఇతర మూవీల్లో కనిపించని మోహన్ బాబు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. ఇటీవలే 'కన్నప్ప' సినిమాలో అదరగొట్టిన డైలాగ్ కింగ్ .. మరో రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్లను ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అవి కూడా క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.


రెండు భారీ ప్రాజెక్టులతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు మోహన్ బాబు. మొదటిది నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో వస్తున్న ‘ద ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాలో మోహన్ బాబు లుక్ ను సైతం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో మోహన్ బాబు శికంజ మాలిక్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది మార్చి 26న విడుదల కాబోతోంది. ఇక మోహన్ బాబు నటించబోతున్న మరో సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఈ పేరును ఇంకా ఖరారు చేయలేదు కానీ ఆ పేరు ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కు వినిపిస్తోంది. ఈ సినిమాను 'ఆర్.ఎక్స్. 100, మంగళవారం' చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) రూపొందిస్తున్నాడు. విశేషం ఏమంటే... ఈ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సి. అశ్వినీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లోనూ మోహన్ బాబు పాల్గొన బోతున్నాడని సమాచారం. మరి ఈ రెండు సినిమాలతో మోహన్ బాబు మళ్ళీ తన సత్తా చాటుతాడేమో చూడాలి.

Read Also: GlobeTrotter: ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈవెంట్ నిర్వహణ.

Read Also: Thalapathy Vijay: వ్యూస్ వివాదంలో జన నాయగన్ సాంగ్

Updated Date - Nov 12 , 2025 | 06:49 PM