Mohan Babu - The Paradise: ‘ది ప్యారడైజ్’లో పవర్‌ఫుల్ విలన్‌గా కలెక్షన్‌కింగ్..
ABN, Publish Date - Sep 27 , 2025 | 12:15 PM
నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ లో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నాని చేసిన పోస్ట్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది.
'ఇక్కడ గొప్ప హీరోలున్నారు.. గొప్ప విలన్లూ ఉన్నారు..
ఆయన హీరో, విలన్‌తోపాటు అంతకు మించి,
ఆయన అలా ఎందుకు అనిపించుకున్నారో గుర్తు చేయడానికి మరోసారి వచ్చేస్నున్నారు’
అంటూ హీరో నాని పెట్టిన పోస్ట్ అభిమానుల్ని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఇదంతా ఎందుకంటే.. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంతో మోహన్‌బాబు ప్రతినాయకుడిగా బలమైన పాత్ర పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు నటిస్తున్నారని ఎంతో కాలంగా వార్తలొస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ మేకర్స్ ఈ రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని నాని ట్వీట్ చేశారు. ఇందులో మోహన్‌బాబు లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన ‘శికంజ మాలిక్’గా కనిపించనున్నట్లు తెలుపుతూ పోస్టర్ విడుదల చేశారు. చొక్కా లేకుండా గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ రగ్గడ్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. ఆయన ఇందులో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారని తెలిపారు.
ఇందులో నాని లుక్ కూడా కొత్తగా ఉంది. ఇప్పటి వరకూ కనిపించని డిఫరెంట్ లుక్‌లో నాని కనిపించనున్నారు. ఇందులో నాని ‘జడల్’ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతోపాటు మొత్తం 8 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.