సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mohan Babu: మోహ‌న్‌బాబు.. అదిరిపోయే పార్టీ! త‌ర‌లిరానున్న ఇండ‌స్ట్రీ

ABN, Publish Date - Nov 16 , 2025 | 07:29 PM

మంచు భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబు (Mohan Babu)గా మారి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులకు దాటుకొని మోహన్ బాబు 50 వసంతాలు పూర్తిచేసుకున్నాడు.

Mohan Babu

Mohan Babu: మంచు భక్తవత్సలం నాయుడు.. మోహన్ బాబు (Mohan Babu)గా మారి 50 ఏళ్ళు పూర్తయ్యాయి. సినీ పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులకు దాటుకొని మోహన్ బాబు 50 వసంతాలు పూర్తిచేసుకున్నాడు. ఇక తండ్రి 50 ఏళ్ల ఉత్సవాన్ని కొడుకు మంచు విష్ణు (Manchu Vishnu) ఎంతో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడు. నవంబర్ 22 న MB50- ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్ పేరుతో ఓకే ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఇండస్ట్రీ మొత్తం కదిలిరానుంది.

ఇక దీనికన్నా ముందే మోహన్ బాబు మరో పార్టీని ఎరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. నేడు దస్పల్లా లో మోహన్ బాబు ఒక ల్యావిష్ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, కుటుంబ సభ్యులు, మోహన్ బాబు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అటెండ్ అవ్వనున్నారట. దీని కోసం మోహన్ బాబు చాలానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తనతో పనిచేసినవారు.. తనను ఆదరించినవారు.. తనకు సపోర్ట్ గా నిలిచినవారిని పిలిచి వారికి థాంక్స్ చెప్పనున్నాడట మోహన్ బాబు.

అయితే ఈ ఈవెంట్ కు మంచు మనోజ్ దంపతులు అటెండ్ అవుతారా అనేది అనుమానం. గత కొన్ని నెలలుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్న విషయం తెల్సిందే. మోహన్ బాబు సైతం.. మనోజ్ తో మాట్లాడడం లేదు. మరి తన జీవితంలో జరుగుతున్న అరుదైన వేడుకకు కొడుకును పిలవకుండా మోహన్ బాబు ఉంటాడా అంటే.. అది డౌటే అంటున్నారు నెటిజన్స్. మరి ఈ వేడుకకు ఎవరెవరు వచ్చారు అనేది తెలియాలంటే ఫొటోస్ బయటకు రావాల్సిందే.

Updated Date - Nov 16 , 2025 | 07:46 PM