Mohan Babu: వింటేజ్ లుక్ అదిరింది.. విలనిజం ఎలా ఉంటుందో
ABN, Publish Date - Sep 27 , 2025 | 07:07 PM
న్యాచురల్ స్టార్ నాని (Nani) - శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన దసరా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Mohan Babu: న్యాచురల్ స్టార్ నాని (Nani) - శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో వచ్చిన దసరా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానిని అంత రా అండ్ రస్టిక్ గా చూపించడం శ్రీకాంత్ వల్ల తప్ప ఇంకెవరి వలన కాదు అనిపించేలా చేశాడు. ఇక ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఏ ముహూర్తాన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యిందో.. అప్పటి నుంచి సినిమాపై అంచనాలు ఆకాశానికితాకాయి . ఇక ఈ చిత్రంలో నానికి ధీటుగా మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నాడు అని అన్నారో ఇక ఫ్యాన్స్ భూమి మీద నిలవడం లేదు.
ఒకప్పుడు విలన్ గా తన సత్తా చాటిన మోహన్ బాబు హీరోగా, నిర్మాతగా ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్ కు అందించాడు. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్లీ విలన్ గా రీఎంట్రీ ఇవ్వడం అనేది గొప్ప విషయం. అందులోనూ మోహన్ బాబు విలనిజంలో చాలా షేడ్స్ ఉంటాయి.అలాంటి మోహన్ బాబునే కథ చెప్పి ఒప్పించాడు అంటే శ్రీకాంత్ ఓదెల గట్స్ ను మెచ్చుకోవచ్చు. ఇక నేడు మోహన్ బాబు పోస్టర్స్ ను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. మొదట మరీ వైల్డ్ గా షర్ట్ లేకుండా కనిపించినా.. రెండో పోస్టర్ లో వింటేజ్ మోహన్ బాబును చూపించి షేక్ చేశారు.
నిజం చెప్పాలంటే మోహన్ బాబు విలనిజం ఈ కాలంలో అంత మెప్పిస్తుందా.. ? అనేది కొందరి ప్రశ్న. ఇప్పుడందరూ జనరేషన్ కు తగ్గట్లు విలనిజాన్ని చూపిస్తున్నారు. మోహన్ బాబు వింటెజ్ లుక్ బావుంది కానీ, వింటేజ్ విలనిజం వర్క్ అవుట్ అవుతుందా.. ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నాడు. తన కెరీర్ లోనే అత్యంత క్రూరమైన పాత్ర ఇది అని ఆయన చెప్పుకొచ్చాడు. మరి మోహన్ బాబు తన విలనిజంతో ఫ్యాన్స్ ను మెప్పిస్తాడా లేదా చూడాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.
Meenakshi Chaudhary: మీనూ పాప కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందిరోయ్..
R Narayana Murthy: మాకు అవమానం జరగలేదు...