Manchu Mohan Babu: న్యూజిలాండ్ లో విష్ణు 7000 ఎకరాలు కొన్నాడు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jun 21 , 2025 | 09:07 PM
మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu).. గత కొన్నేళ్లుగా కొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)ను హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.
Manchu Mohan Babu: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu).. గత కొన్నేళ్లుగా కొడుకు మంచు విష్ణు(Manchu Vishnu)ను హీరోగా నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మంచు కుటుంబం మీద ఉన్న నెగిటివిటీ వలనో.. లేక కథల ఎంపికలో లోపం వలనో తెలియదు కానీ విష్ణు ఇప్పటివరకు ఒక మంచి హిట్ ను అందుకోలేకపోయాడు. ఇక ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ ను దక్కించుకోవాలని తండ్రీకొడుకులు భారీ బడ్జెట్ తో కన్నప్ప(Kannappa) సినిమాను తెరకెక్కించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలను క్యామియోలుగా చూపించడంతో కన్నప్పపై హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ .. ఒక క్యామియో చేస్తున్నాడు అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటినుంచి కన్నప్పపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొత్తం మంచు విష్ణు ఒక్కడే భుజాన వేసుకున్నాడు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ తో బిజీగా మారాడు. ఇంకోపక్క మోహన్ బాబు సైతం తనకు తోచిన విధంగా సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న తన కన్నప్ప తన తల్లే అని చెప్పుకొచ్చిన మోహన్ బాబు.. ఈసారి తన కొడుకు గురించి గొప్పలు చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ లో విష్ణు 7000 ఎకరాలు కొన్నాడు అంటూ బాంబ్ పేల్చాడు. కన్నప్ప సగానికి పైగా షూటింగ్ న్యూజిలాండ్ లోని 7000 ఎకరాల అందమైన ప్రదేశంలో జరిగిందని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మోహన్ బాబు ఆ 7000 ఎకరాల భూమి కూడా తమదే అని చెప్పుకురావడం అందరిని షాకింగ్ కు గురిచేస్తుంది. న్యూజిలాండ్ లోని వనాకా లో ఉన్న హౌస్ ను కూడా కొన్నట్లు తెలిపాడు.
బ్రహ్మాజీ వీడియో తీస్తుండగా.. ' ఇదంతా నా ప్రాపర్టీ. ఇదంతా మేము కొన్నాం అని మోహన్ బాబు అనగా బ్రహ్మాజీ ఇన్ కమ్ ట్యాక్స్ వారువింటున్నారు కదా.. మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనగానే నో బ్లాక్ మనీ అంటూ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నాం. దేవుడి దయ వలన ఇదంతా మనదే అంటూ అక్కడ ఉన్న ముకేశ్ ఋషిని, ప్రభుదేవాను మోహన్ బాబు పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Jayaprada: 'జయప్రదం' గా సాగిన లలితా రాణి!