Aamir Khan: కూలీ చేసి.. పెద్ద తప్పు చేశాను

ABN , Publish Date - Sep 13 , 2025 | 09:23 PM

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు.. ఇంకో స్టార్ హీరో సినిమాల్లో చేయడం ట్రెండ్ గా మారిపోయింది. కొన్ని క్యామియోలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లగా..

Aamir Khan

Aamir Khan: ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు.. ఇంకో స్టార్ హీరో సినిమాల్లో చేయడం ట్రెండ్ గా మారిపోయింది. కొన్ని క్యామియోలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లగా.. ఇంకొన్ని క్యామియోలు అసలు ఎందుకు పెట్టారో కూడా అర్దం కాకుండా ఉండిపోయాయి. అలాంటి సినిమాల్లో కూలీ (Coolie) ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) - లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)విలన్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ చివరన ఒక చిన్న పాత్రలో మెరిశాడు.


అయితే ఆమీర్ పాత్ర సినిమాకు అంతగా ఉపయోగపడింది లేదు. అసలు ఎందుకు లోకేష్.. ఆ పాత్రను పెట్టాడో కూడా ఎవరికీ అర్దం కాలేదు. ఇక ఆమీర్ ఈ పాత్ర చేసి తప్పు చేసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం పెద్ద దూమరాన్నే రేపింది. కూలీ సినిమా చేసి తప్పు చేశాను. కేవలం రజినీకాంత్ పై ఉన్న అభిమానంతోనే ఈ పాత్ర చేశాను. అసలు లోకేష్ నాకు ఎలాంటి కథను వినిపించలేదు. కేవలం అలా నడుచుకుంటూ రెండు సార్లు నవ్వి వెళ్లిపోతాను అని చెప్పాడు. అది చేయడం తప్పు అని నాకు ఇప్పడు అర్దమయ్యింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.


తాజాగా ఆ వార్తలను ఆమీర్ ఖాన్ టీమ్ ఖండించింది. ఆమీర్ కూలీ మీద ఎలాంటి ఇంటర్వ్యూ కానీ, ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఇవ్వలేదని, నెగిటివ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదని చెప్పుకొచ్చింది. 'ఆమీర్ ఖాన్ అలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కూలీ సినిమా గురించి ఎటువంటి నెగిటివ్ వ్యాఖ్యలు చేయలేదు. రజనీకాంత్, లోకేష్ మీదనే కాదు.. కూలీ మొత్తం బృందం పట్ల ఖాన్ కు అత్యంత గౌరవం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే అంతా చెప్తుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bakasura Restaurant: చిన్న సినిమా.. ఓటీటీలో అదరగొడుతుందిగా

Sunday Tv Movies: ఆదివారం, Sep14.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Sep 13 , 2025 | 10:07 PM