Mohan Babu: నేను వండుకొనే పాత్రలో మల విసర్జన చేసింది.. అయినా అందులోనే వండుకొని తిన్నా
ABN, Publish Date - Jul 20 , 2025 | 07:54 PM
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు.
Mohan Babu: ఇప్పుడున్న స్టార్స్ అందరూ ఇంత స్టార్ డమ్ ను అనుభవిస్తున్నారు అంటే.. వారి కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు పడి ఈస్థాయికి చేరుకున్నారని అర్ధం. ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చి ఇప్పుడు తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) కూడా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, తిండి, నిద్ర లేని రాత్రులు.. ఇవన్నీ తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. మోహన్ బాబు నిలబడ్డాడు. అలా నిబడ్డాడు కాబట్టే పీటీ టీచర్ భక్తవత్సలం నాయుడు.. ఇప్పుడు మోహన్ బాబుగా కొనియాడబడుతున్నాడు.
ఎన్నో ఇంటర్వ్యూల్లో మోహన్ బాబు తన గతం తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నాడు. కానీ, చాలా తక్కువగా కెరీర్ మొదట్లో ఆయన అనుభవించిన కష్టాలను చెప్పుకోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు తానేంటి.. ? ఎలా వచ్చాను అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. కర్లీ టేల్స్ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ' నేను ఎప్పుడు డిసిప్లేన్ గా ఉంటాను. ఇంటికి వచ్చినవారి ఎదుట కాళ్లు ముందుకు చాపి మాట్లాడితే పద్దతిగా ఉంటుందా.. ?. మర్యాద ఇవ్వడం అనేది ఎంతో ముఖ్యం. అది నేను నేర్చుకున్నవాటిలో మొదటిది.
ఎంత డబ్బు నీకుంది అనేది నీ ఇష్టం. అది నీ దగ్గరే పెట్టుకో. డబ్బుతో మర్యాదను కొనలేము. దానిని నేను లెక్కచేయను. నీ దగ్గర డబ్బుంది.. నీకు మర్యాద ఇవ్వాలి అని నేను అనుకోను. ఒక మనిషికి అయితే మర్యాద ఇస్తాను. నా తండ్రి ఒక టీచర్.. నేనొక టీచర్ గా చేసి వచ్చాను. ఆయన నాకు అదే నేర్పించాడు. నాకొక వీక్ నెస్ ఉంది. నేను ముక్కుసూటి మనిషిని. కోపం ఎక్కువ. ఈ రెండే నాకున్న బ్యాడ్ లక్షణాలు. వీటివలన నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. ముక్కుసూటితనం ఇంకా అలానే ఉంది. కోపం కొద్దికొద్దిగా తగ్గించుకుంటున్నాను
మద్రాస్ లో చదువుకున్నాను. అప్పుడే పీటీ టీచర్ గా జాబ్ వచ్చింది. అప్పుడు జీవితం మొదలయ్యింది. నెమ్మది నెమ్మదిగా యాక్టింగ్.. యాక్టింగ్ అంటూ తిరిగాను. మొదట్లో కార్ షెడ్ లో ఉండేవాడిని. నేను, ఇంకొక అతను. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక్కోరోజు కేవలం నీళ్లు తాగే పడుకొనేవాడిని. ఉదయం మొత్తం ఛాన్స్ లు కోసం తిరిగేవాడిని. అలా అని చిన్న చిన్న పాత్రలు చేసేవాడిని కాదు. విలన్ గా ఉంటే చెప్పమని అడిగేవాడిని. ఆ కారు షెడ్ కు కూడా ప్రోపర్ గా రెంట్ ఇచ్చేవాడిని కాదు.
అప్పట్లో నా దగ్గర చిన్న చిన్న పాత్రలు, ఒక స్టవ్ ఉండేవి. అందులోనే కొద్దిగా రైస్ పెట్టుకొనేవాడిని. రసం లాంటిది చేసుకునేవాడిని. అయితే ఒకరోజు మా ఇంటి ఓనర్.. వీళ్లు రెంట్ ఇవ్వడం లేదు అని చెప్పి నేను అన్నం వండుకొని పాత్రలో మల విసర్జన చేసింది. ఆరోజు రాత్రి నేను షెడ్ కు వెళ్లేసరికి చెడు వాసన. ఆమె చేసిందని అర్థమైంది. నేను వెళ్లి దాన్ని కిందపడేసి.. పంపు కింద పెట్టి కడిగాను. అందులో ఏదో పొడి వేసి పక్కన పెట్టాను. పొద్దునే ఒక ఓల్డ్ లేడీ వచ్చి.. బాబు గారు.. ఆ చెత్త లేడీ ఈ పని చేసింది. నేను చూసాను అని చెప్పింది. నేను.. అమ్మా అలా చేయకూడదు.. పద్దతి కాదు. చేయకండి అలా అనిచెప్పాను. ఆమె ఆ పాత్రను మట్టితో క్లీన్ చేసింది. ఆ తరువాత అందులోనే మళ్లీ వండుకొని తిన్నాను. ఏం చేయాలి. నాకు వేరే గత్యంతరం లేదు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మోహన్ బాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Anshu: బికినీ వేసినంత ఈజీ కాదు పాప హిట్ అందుకోవడం
Nihar Kapoor: భల్లాలదేవా పాత్ర నేను చేయాల్సింది.. జయసుధ కొడుకు కీలక వ్యాఖ్యలు