సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maa Vande: తెలుగులో.. హీరోగా ఉన్ని ముకుందన్! 'మోదీ'.. బయోపిక్ స్టార్ట్‌

ABN, Publish Date - Dec 20 , 2025 | 06:09 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను వీర్ రెడ్డి 'మా వందే' పేరుతో నిర్మిస్తున్నారు. ఉన్ని ముకుందన్ ప్రధాని పాత్రను పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

Maa Vande Movie Opening

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బయోపిక్ ను 'మా వందే' (Maa Vande) టైటిల్ తో వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో, జన‌తా గ్యారేజ్ సినిమాలో.. ఎన్టీఆర్ త‌మ్ముడిగా, భాగ‌మ‌తిలో అనుష్క ప్రేమికుడిగా న‌టించిన ఉన్ని ముకుందన్ (Unni Mukundan) నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్ సిహెచ్. శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.


ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా 'మా వందే' సినిమాలో చూపించబోతున్నామని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోందని నిర్మాత వీర్ రెడ్డి చెప్పారు. 'మా వందే' చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ ఓ కీలక పాత్రను పోషించబోతున్నారు. ఈ చిత్రానికి సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా శేఖర్ ప్రసాద్ ఎడిటర్ గా చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ ను కింగ్ సోలోమన్ నిర్వహిస్తుండగా, కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 07:28 PM