సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్‌ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:50 PM

సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఎం.ఎం.కీరవాణి తను పని చేసే సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం అందిస్తారు. ఇక ఈ సినిమా నాది అనుకుంటే మాత్రం దానికంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చేస్తారు. అది కూడా సర్‌ప్రైజ్‌లా చేస్తుంటారు.

MM Keeravani - Pawan Kalyan

సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఎం.ఎం.కీరవాణి తను పని చేసే సినిమాకు ప్రాణం పెట్టి సంగీతం అందిస్తారు. ఇక ఈ సినిమా నాది అనుకుంటే మాత్రం దానికంటూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చేస్తారు. అది కూడా సర్‌ప్రైజ్‌లా చేస్తుంటారు. గతంలో రాజమౌళి కోసం.. (MM Keeravani Surprise)


‘ఎవడంట ఎవడంట బాహుబలి తీసింది..
మా పిన్నికి పుట్టాడు ఈ నంది కానీ నంది’


అంటూ రాజమౌళినే కంటతడి పెట్టించేలా ఓ పాటను సిద్దం చేసి సర్‌ప్రైజ్‌ చేశారు.


ఇప్పుడు అదే తరహాలో పవన్‌కల్యాణ్‌ కోసం ఓ ప్రత్యేక పాటను సిద్ధం చేసి జనాల్లోకి వదిలారు కీరవాణి. ఆ పాట పేరు ‘జూలై 24’ ఈ పాట రెడీ చేసినట్లు దర్శకనిర్మాతలకు కూడా తెలీదని, తనకు, తన సింగింగ్‌ టీమ్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. (harihara veeramallu july 24th)

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేడుకలా ఘనంగా జరిగింది. పవన్‌ కల్యాణ్‌ చాలా రోజుల తర్వాత సినిమా వేడుకకు రావడంతో అభిమానులు ఓ రేంజ్‌లో సందడి చేశారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ అభిమానులను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్‌ ఫ్యాన్స్‌లో రెట్టింను ఉత్సాహాన్ని నింపింది. ఇదిలా ఉంచితే సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన సర్‌ప్రైజ్‌ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్‌ కల్యాణ్‌ సినిమాకు కీరవాణి పని చేయడం ఇదే మొదటిసారి. అందులోనూ పవన్‌ అంటే ఆయనకు విపరీతమైన అబిమానం. ఆ అభిమానాన్ని ఓ పాట రూపంలో తీర్చిదిద్ది ప్రీ రిలీజ్‌ వేడుకపై చాటుకొన్నారు. (MM Keeravani Surprise song)


పవన్‌ సినిమా టైటిళ్లలో (MM Keeravani Surprise song for pawan kalyan) ఓ పాటను కంపోజ్‌ చేసి, అది వేదికపై తన సింగర్స్‌ టీమ్‌తో ఆలపించారు. వేదికపై ఆ పాటను పాడించి చిత్ర బృందంతో పాటు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఎంఎం. క్రీమ్‌. ఆ పాటలకు పవన్‌ అభిమానులకు పూనకాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. పవన్‌ స్పీచ్‌తోపాటు వేదికపై పాట కూడా హైలైట్‌గా నిలిచింది. (Pawan kalyan July 24)

కీర‌వాణి బృందం ఆల‌పించిన పాట ఇదే..

'గోకులంలో సీత వెదికింది
అత్తారింటికి దారేదని…అక్క‌డ అమ్మాయికి
ఇక్క‌డ అబ్బాయి దొరికితే.. ఖుషి!

త‌మ్ముడూ.. హే త‌మ్ముడూ
ఎక్క‌డున్నాడు ఆ కాట‌మ‌రాయుడు'

త‌మ్ముడూ… హే త‌మ్ముడూ
ఆ అజ్ఞాత‌వాసిని వెదికి ప‌ట్టుకో 

నేడుపులి పంజాకైనా దొర‌క‌ని గబ్బ‌ర్ సింగ్ వాడూ
స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ వాడూ..

బెదిరిస్తే వ‌స్తాడా.. నెవ్వ‌ర్‌
హీ హీజ్ గుడుంబా.. శంక‌ర్‌
పెరిగిపోతోందిక్క‌డ‌… ఫీవ‌ర్‌
కొట్టుకో.. కొట్టుకో.. తీన్ మార్‌

మా బంగారానికి నీపై తొలిప్రేమ పుట్టింది బ్రో..
ఈ వ‌కీలు సాబే త‌న లైఫ్‌లోన జానీ అంటోంది బ్రో..

ఈ బాలుని.. ఈ బ‌ద్రిని.. ఈ భీమ్లా నాయ‌క్‌ని
గోపాల గోపాల మాంగ‌ళ్య‌మంత్రాల‌
అన్న‌వ‌రంలో పెళ్లాడు మంత్రాల జ‌ల్సాల‌


వేదిక‌కి సుస్వాగ‌తం..
ఆ సునామికి సుస్వాగ‌తం..

ఇది అరాచ‌కం.. ఇది అరాచ‌కం

రాంబాబూ… నువ్వు రెడీ అయిపో

నీ కెమెరాతో.. నువ్వు రెడీ అయిపో

ఆ గంగ‌తో.. ఇక రెచ్చిపో..

వ‌స్తున్నాడొస్తున్నాడొస్తున్నాడ‌హో.. వ‌చ్చేశాడొచ్చేశాడోచ్చేశాహో…
ఎవ్వ‌డూ… హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు…!
 

ఆ పాటకు సంబంధిన ఇతర పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చేస్తామని కీరవాణి తెలిపారు. 

Updated Date - Jul 22 , 2025 | 01:49 PM