Mithra Mandali: కుటుంబ సమేతంగా చూసే క్లీన్ ఎంటర్‌టైనర్
ABN, Publish Date - Oct 03 , 2025 | 04:22 PM
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించిన చిత్రం 'మిత్ర మండలి'.
ప్రియదర్శి(Priya Darshi), నిహారిక ఎన్ఎమ్(Niharika NM) , విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించిన చిత్రం 'మిత్ర మండలి'(mithra mandali) . వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ కీలక పాత్రధారులు. బివి వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌లపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, 'కత్తి అందుకో జానకి’, ‘స్వేచా స్టాండు’, ‘జంబర్ గింబర్ లాలా’ వంటి పాటలతో పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో సందడి చేసింది.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ‘మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు విజయవాడ ఉత్సవ్ కమిటీ, ఏపీ పోలీసు బలగాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని మా పరిశ్రమలోని వ్యక్తులు ఎల్లప్పుడూ చెబుతారు. అక్టోబర్ 16న రానున్న ‘మిత్ర మండలి’ థియేటర్లలో కుటుంబం మొత్తంతో ఆస్వాదించగల క్లీన్ ఎంటర్‌టైనర్’ అని అన్నారు.
బన్నీ వాస్ మాట్లాడుతూ ‘లిటిల్ హార్ట్స్’తో ఎంతగా అయితే నవ్వించామో ఈ ‘మిత్ర మండలి’తోనూ అంతే స్థాయిలో ఖచ్చితంగా నవ్విస్తాము. సినిమా చూసి మీరు నవ్వి నవ్వి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు’ అని అన్నారు.
హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ మాట్లాడుతూ ‘మిత్ర మండలి’ పక్కా కామెడీ చిత్రం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.