MissTerious: తుదిమెరుగుల్లో థ్రిల్లర్ మూవీ...

ABN, Publish Date - May 15 , 2025 | 06:41 PM

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ ప్రధాన పాత్రధారిగా రూపుదిద్దుకుంటున్న సినిమా 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

ప్రముఖ నటుడు, స్వర్గీయ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ (Abid Bhushan), బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని (Abid Bhushan), రియా కపూర్ (Riya Kapoor), మేఘనా రాజ్ పుత్ (Meghana Rajput) ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'మిస్టీరియస్' (MissTerious). ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే ను ఇవ్వడంతో పాటు దర్శకత్వం వహించారు మహి కోమటిరెడ్డి (Mahi Komatireddy). కన్నడ నటుడు బలరాజ్ వాడి, ఆకునూరి గౌతమ్, భోగిరెడ్డి శ్రీనివాస్, 'జబర్దస్త్' రాజమౌళి, గడ్డం నవీన్, లక్ష్మీ, వేణు పోల్సాని తదితరులు ఈ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జయ్ వల్లందాస్ నిర్మించారు.


'మిస్టీరియస్' మూవీ గురించి దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ''ఇందులో పాత్ర అనుమానాస్పదంగానే ప్రవర్తిస్తుంటుంది. దాని కారణంగా ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులు మిస్టరీతో కూడిన సస్పెన్స్ కు లోనవుతాడు. చివరి వరకూ ఉత్కంఠ కొనసాగేలా... ఒక్కో క్లూ నూ బహిర్గతం చేసేలా కథనం సాగుతుంది. ఇందులోని షాకింగ్ ట్విస్టులు ప్రేక్షకుల ఊహకు అందుకుండా ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాను ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించే ప్రయత్నం చేశాం'' అని అన్నారు.

నిర్మాత జయ్ వల్లందాస్ సినిమా గురించి చెబుతూ, 'దర్శకుడు మహి కోమటిరెడ్డిలో చక్కని క్లారిటీ ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి తనకు కావాల్సిన దానిని చక్కగా ఎక్స్ ప్లోర్ చేశారు. ఇందులో మూడు మంచి పాటలున్నాయి. ఈ పాటలకు సాహిత్యం అందించడంతో పాటు... సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా సాహిత్యాన్ని కూడా తానే సమకూర్చారు. అతి త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం. ఓ మంచి రోజు చూసుకుని సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం. షూటింగ్ పూర్తి అయిన 'మిస్టీరియస్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో ఉంది'' అని అన్నారు. రామ్ ఉప్పు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలను పరవస్తు దేవేంద్ర సూరి నిర్వహిస్తున్నారు.

Also Read: Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ పై కె. ఎస్.ఆర్. ఏమన్నారంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 15 , 2025 | 06:42 PM