Mirapakay: మాసోడి మాస్ రచ్చ రెడీ..!
ABN , Publish Date - Jun 21 , 2025 | 06:48 PM
మాస్ మహారాజా మళ్లీ బాక్సాఫీ'స్ ను ఘాటెక్కించబోతున్నాడు. తన కెరీర్ లో ఓ స్పెషల్ మూవీతో మళ్లీ బిగ్ స్క్రీన్ పై రచ్చ చేయబోతున్నాడు. ఆల్రెడీ రీరిలీజుల ట్రెండ్ తో తనదైన స్పెషాలిటీ చూపిస్తున్న హీరో.. ఇప్పుడు మరో మూవీని తీసుకురాబోతున్నాడు. మరి ఆ మూవీ ఏంటి.. ఆ కథేంటి .
మిరపకాయ్ (Mirapakay)... ఒక్క టైటిల్‌తో థియేటర్స్‌లో సీటీల సునామీ తెప్పించిన మాస్ బ్లాక్‌బస్టర్. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కెరీర్‌ని స్కై హై లెవెల్‌కి చేర్చిన ఈ చిత్రం, అప్పట్లో బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టి వసూళ్ల రికార్డులను రగిలించింది. టైటిల్‌కి తగ్గట్టు రవితేజ యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్వాగ్తో స్క్రీన్‌పై రచ్చ చేశాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar ) మాస్ మసాలాతో తెరకెక్కించిన ఈ సినిమా, యూత్‌లో ట్రెండ్ సెట్ చేసి, ఫ్యాన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు, ఈ సినిమా మళ్లీ బిగ్ స్క్రీన్‌పై ఘాటెక్కించడానికి రెడీ అవుతోంది.
జులై 11న మిరపకాయ్ గ్రాండ్ గా రీ-రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో గ్లామర్ క్వీన్స్ రిచా గంగోపాధ్యాయ్ (Richa Gangopadhyay) , దీక్షా సేత్ (Deeksha Seth) హీరోయిన్స్‌గా యూత్‌ని ఉర్రూతలూగించగా.. రమేశ్ పుప్పాల నిర్మాతగా ఈ మాస్ ఫీస్ట్‌ని అందించారు. థమన్ బీట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ని డాన్స్ ఫ్లోర్‌పై స్టెప్పులు వేయిస్తుంటాయి. అంతేకాదు, రవితేజ సిగ్నేచర్ ఎనర్జీ, పంచ్ డైలాగ్స్‌తో సినిమా హైలైట్ సీన్స్ ఫ్యాన్స్‌ని ఇప్పటికీ గూస్‌బంప్స్‌తో ఊపేస్తాయి.
ఇటీవల 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' రీ రిలీజ్ తో జనాన్ని పలకరించిన రవితేజ, ఇప్పుడు 'మిరపకాయ్' తో కొంచెం కారంగా... కొంచెం గారంగా సాగనున్నారు. 'మిరపకాయ్' మళ్ళీ వస్తోందని తెలియగానే ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది. థియేటర్స్‌లో సీటీలు, డాన్స్‌లతో రచ్చ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ మూవీలో నటించిన ఇద్దరు ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించకపోయినా... ముద్దుగుమ్మల గ్లామర్ ట్రీట్ మరోసారి యూత్ ను అట్రాక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటు రవితేజ అటు హరీశ్ శంకర్ కు కొత్త ఊపిరి పోసేలా కనిపిస్తోంది ఈ మూవీ. అప్పట్లో వరుస ఫ్లాప్ లతో ఉన్న రవితేజను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందీ మూవీ. ఇప్పుడు డిజాస్టర్లతో సతమతమవుతున్న మాసోడికి... ఈ మూవీ రీరిలీజ్ బూస్ట్ గా మారే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఈ రి రిలీజ్ ఏ తీరున బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తుందో!?
Read Also:
Nagababu: నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాం.. మాదే తప్పు