సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai: హనుమాన్ హీరోకు పెద్ద సమస్యే వచ్చి పడిందే

ABN, Publish Date - Aug 23 , 2025 | 03:42 PM

కుర్ర హీరో తేజ సజ్జా(Teja Sajja)కు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. హనుమాన్ (Hanuman)సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న తేజ..

Mirai

Mirai: కుర్ర హీరో తేజ సజ్జా(Teja Sajja)కు రిలీజ్ కష్టాలు మొదలయ్యాయి. హనుమాన్ (Hanuman)సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న తేజ.. తరువాత మిరాయ్(Mirai) సినిమాను మొదలుపెట్టాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తేజ సరసన రితికా నాయక్ నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అన్ని కుదిరితే ఈపాటికే మిరాయ్ రిలీజ్ అయ్యి ఉండాలి. కానీ, వాయిదాలు పడుతూ సెప్టెంబర్ 5 న రిలీజ్ కు సిద్ధమైంది. అందుకు తగ్గట్లుగానే తేజ సజ్జా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం మిరాయ్ మరోసారి వాయిదా పడిందని తెలుస్తోంది. దానికి కారణం.. మిరాయ్ ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమా కావడంతో ఆ వర్క్ ఇంకా అవ్వకపోవడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అన్ని అనూకూలంగా జరిగి ఉంటే ఈ పాటికే ఆ వర్క్ పూర్తయ్యి ఉండేది. కానీ, ఈ మధ్య సమ్మె జరగడంతో ఆలస్యం అయ్యిందని సమాచారం.


ఇక చేసేదిలేక మిరాయ్ రెండు వారాలు వెనక్కి వెళ్లినట్లు టాక్. అయితే రెండు వారాలు అంటే.. సెప్టెంబర్ 12 న వస్తుంది అని అంటున్నారు. అదే రోజున తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి రిలీజ్ కు రెడీ అవుతోంది. డబ్బింగ్ సినిమాగా కాంత వస్తుంది. ఈ రెండిటితో మిరాయ్ పోటీకి సిద్దమవుతుంది. మిరాయ్ తో కిష్కింధపురి అంత పోటీ కాదు అని చెప్పలేం. కానీ, అదేమో హర్రర్.. ఇదేమో సూపర్ హీరో.. రెండు డిఫరెంట్ జానర్స్ అయినా కథ ఏంటి.. ? ప్రేక్షకులను మెప్పించగలదా అనేది చూడాలి. ఇక ఈ డేట్ కాకపోతే మిరాయ్ వెనక్కి వెళ్ళలేదు.


సెప్టెంబర్ 25 న OG వస్తుంది. దాంతో పోటీ అంటే తేజ కాదు పీపుల్ మీడియానే ముందుకు రాదు. ఇది కాకుండా వెనక్కి వెళ్ళాలి అంటే అక్టోబర్ చూసుకోవాలి. ఇలా హనుమాన్ హీరోకు రిలీజ్ కష్టాలు ఎదురయ్యాయి. మరి ఇవన్నీ దాటుకొని మిరాయ్ వచ్చేది ఎప్పుడు అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.

Chiranjeevi: మరోసారి చేతులెత్తేసిన 'స్టాలిన్'

Pradeep Ranganathan: దీపావళి రేస్ లో రెండు సినిమాలు

Updated Date - Aug 23 , 2025 | 03:42 PM