Trinadha Rao Nakkina: 'నేను రెడీ'కి.. మిక్కీ స్వరాలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:00 PM
హవీష్, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'నేను రెడీ'. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina), యువ కథానాయకుడు హవీష్ (Haveesh) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న సినిమా 'నేను రెడీ' (Nenu Ready) . ఈ సినిమాతో హవీష్ సోదరి నిఖిల కోనేరు నిర్మాతగా మారుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విశేషం ఏమంటే... ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతం అందిస్తున్నాడు. త్రినాథ రావు నక్కిన ఇప్పటి వరకూ 'సినిమా చూపిస్త మావా, నేను లోకల్, థమాకా, మజాకా' వంటి హిట్ చిత్రాలను రూపొందించారు. అయితే మిక్కీ - త్రినాథరావు నక్కిన కలిసి పనిచేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. త్రినాథ రావు నక్కిన సినిమాలంటే మాస్ సాంగ్స్ తో ఉంటాయి. మిక్కీ జే మేయర్ కు సాఫ్ట్ మెలోడీ సాంగ్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుంది. మరి మాస్ అండ్ మెలోడీ కలగలిన ఈ సినిమాలో పాటలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
హవీష్ సరసన 'నేను రెడీ' మూవీలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. భారీ అంచనాలు నెలకొంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా జనం ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతున్నారు. నజర్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ పూడి ఎడిటర్. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే ను విక్రాంత్ శ్రీనివాస్ అందిస్తున్నాడు. ఇతర ప్రధాన పాత్రలను శ్రీలక్ష్మీ, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూప లక్ష్మీ, జయవాణి, మానిక్ రెడ్డి, బలగం సత్యనారాయణ, రోహన్ రాయ్ తదితరులు పోషిస్తున్నారు. ఈ సినిమాతో హవీష్ కు మంచి సక్సెస్ లభిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Women’s Cricket Team: మహిళా క్రికెట్ జట్టుకు సెలబ్రిటీల అభినందనలు
Also Read: Bro Code: రవి మోహన్ సొంత సినిమా టైటిల్ వివాదం...