సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

MOSAPOTHIRO MAMO: ర‌ఘు కుంచే సంగీతంలో.. అదిరిపోయే ఐటం సాంగ్‌

ABN, Publish Date - Oct 23 , 2025 | 11:00 PM

అభినవ్ శౌర్య‌, అనుశ్రీ జంట‌గా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన దేవగుడి చిత్రం నుంచి ‘మెసపోతిరో మామో’ ఐటం సాంగ్ విడుదలైంది.

అభిన‌వ్ శౌర్య (Abhinav shaurya), అనుశ్రీ (Anushri)జంట‌గా బెల్లం రామ‌కృష్ణారెడ్డి (Bellam RamaKrishna Reddy) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం దేవ‌గుడి (Devagudi). పుష్య‌మి ఫిలిం మేక‌ర్స్ (Pushyami Film Makers) నిర్మిస్తోంది. రఘు కుంచే. రాకెట్ రాఘ‌వ‌, తోసి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ర‌ఘు కుంచే సంగీతం అందిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, గ్లిమ్స్‌, పాట‌లు ఒక‌దాన్ని మించి మ‌రోటి అద్భుత స్పంద‌న‌ను రాబ‌ట్టుకున్నాయి. ఈక్ర‌మంలో ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల మెస‌పోతిరో మామో.. మెస‌పోతిరో మామో (MOSAPOTHIRO MAMO) అంటూ సాగే అదిరిపోయే ఐటం సాంగ్‌ను విడుద‌ల చేశారు. సందీప్ న‌వ సాహిత్యం అందించ‌గా ర‌ఘు కుంచే, సింధూజ శ్రీనివాస‌న్ (Sindhuja Srinivasan) ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో మంచి వ్యూస్ రాబడుతోంది. మీరూ ఓ లుక్కేయండి

Updated Date - Oct 23 , 2025 | 11:00 PM