New Telugu Love Story: అలరించే ప్రేమకథ
ABN , Publish Date - Jul 26 , 2025 | 02:34 AM
నరేశ్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేఘాలు
నరేశ్ అగస్త్య, రబియా ఖాతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’. సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఉమాదేవి కోట నిర్మించారు. ఆగస్టు 22న థియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు నరేశ్ అగస్త్య మాట్లాడుతూ ‘దర్శకుడు విపిన్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. రబియా చాలా చక్కగా నటించారు. వెరీ బ్యూటిఫుల్ క్లీన్ ఫిల్మ్ ఇది. అందర్నీ తప్పకుండా అలరిస్తుందీ చిత్రం’ అని అన్నారు. ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాం. చాలా ఎఫర్ట్ పెట్టాం. సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని దర్శకుడు విపిన్ అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ రబియా, నటుడు రాజా తదితరులు పాల్గొన్నారు.
Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్
Nara Rohit: పుట్టిన రోజు సందర్భంగా 'సుందర కాండ' రిలీజ్ డేట్