Vishwambhara: హ‌మ్మ‌య్యా.. మొత్తానికి ‘విశ్వంభర’పై క్లారిటీ ఇచ్చారు

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:23 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సినిమా విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఎంటర్‌టైనర్ గురించి చిరంజీవి ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాస్గ గ్యాప్ త‌ర్వాత ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట (Vassishta) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న మెగా ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). ప్ర‌ముక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. త్రిష‌, అషికా రంగ‌నాథ్‌, ర‌మ్య ప‌సుపులేటి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చిరంజీవి 156 చిత్రంగా ప్రారంబ‌మైన ఈ మూవీ సుమారు రెండేండ్లుగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుండ‌గా విడుద‌ల తేది ఎప్ప‌టిక‌ప్పుడు మారుతూ వ‌స్తోంది. కాగా ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాట సినిమాపై మంచి హైప్ తీసుకు రాగా ఆ త‌ర్వాత వ‌చ్చిన టీజ‌ర్ అందులోని విజువ‌ల్స్ విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. దాంతో మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డి పోయారు. అంతేగాక ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చిన సినిమాలు గ్రాఫిక్స్ వ‌ళ్ల ట్రోలింగ్‌కు గుర‌వ‌డ‌మే గాక ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌ర్చిన నేప‌థ్యంలో ఇప్పుడు ఈ సినిమా చిత్ర బృందం ముందుగానే జాగ్ర‌త్త ప‌డుతోంది.

సినిమా దాదాపు స‌గం విఎఫ్ఎక్స్ పైనే ఆధార ప‌డి ఉండ‌డంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేసి పూర్తిగా విజువ‌ల్స్, వీ ఎఫ్‌క్స్ పైనే దృష్టి సారించారు. దీంతో నెల అనుకున్న స‌మ‌యం కాస్త రెండు నెల‌లు, రెండు అనుకున్న‌ది కాస్తారు ఆరు నెల‌లు పోస్ట్‌పోన్ అవుతూ వ‌చ్చింది. ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్ర‌క‌టిస్తారా అని అభిమానులు వేయు క‌ళ్ల‌తో ఎదురు చూస్తుండ‌డం, చిరంజీవి పుట్టిన రోజు కూడా వ‌చ్చేయ‌డంతో తాజాగా ఈ చిత్రం గురించి మేక‌ర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)నే రంగంలోకి దిగి ఓ వీడియోను రిలీజ్ చేసి 21 సాయంత్రం ఓ గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూనే మీ కోసం ఓ చిన్న లీక్ ఇస్తున్నా 2026లో క‌లుద్దాం అంటూ విశ్వంభ‌ర (Vishwambhara) చిత్రం రిలీజ్ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు.

ఈ వీడియోలో.. విశ్వంభర చిత్రం డిలే గురించి, సినిమా ప్రత్యేకతలను గురించి మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా తెలిపారు. సినిమా ఎప్పుడొస్తుందో , ఎందుకు ఆల‌స్య‌మైందో వివ‌రించారు. గ్రాఫిక్స్‌ పధానంగా సాగే ఈ ఫాంటసీ చిత్రం చిన్న పిల్లలు, పెద్దవాళ్లల్లో ఉండే చిన్న పిల్లలకు సైతం భాగ న‌చ్చేలా మూవీ ఉంద‌ని, అంద‌రికీ ఇష్టమైన 2026 వేస‌విలో ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని ఆయన తెలిపారు. ఇప్పుడు చిరంజీవి మాట్లాడిన ఈ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతుండ‌గా, మొత్తానికి ఓ క్లారిటీ వ‌చ్చిందంటూ ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. ఇదిలాఉండ‌గా విశ్వంభ‌ర (Vishwambhara) స్టార్ట్ అయిన ఏడాదిన్న‌ర త‌ర్వాత అనీల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో ప్రారంభ‌మైన మెగాస్టార్ మూవీ ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా సంక్రాంతికి థియేట‌ర్ల‌కు రానుంది. దీంతో వ‌చ్చే ఏడాది చింజీవి సినిమాలు రెండు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

Updated Date - Aug 21 , 2025 | 11:23 AM