సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Megastar Chiranjeevi: విశ్వంభర.. చిరంజీవి న‌యా లుక్‌! కుర్రాళ్ల‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా

ABN, Publish Date - Aug 22 , 2025 | 09:39 AM

మెగాస్టార్ ఈ పేరు విన‌గానే కోట్లాది అభిమానుల గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది.

Chiranjeevi

మెగాస్టార్ ఈ పేరు విన‌గానే కోట్లాది అభిమానుల గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగిపోతుంది. ఆయ‌న‌పై మ‌న్న‌న‌లు, ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి (MegastarChiranjeevi ) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ఆయన పేరు జపిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. ర‌క్త‌దానాలు, హెల్త్ క్యాంపులు నిర్వ‌హిస్తున్నారు.

అయితే.. చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా చిరంజీవి నటిస్తున్న భారీ సినిమా విశ్వంభర (Vishwambhara) నుంచి #MegaBlastGlimpse ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ లో ఊహించని ఆనందాన్ని నింపింది. 2026 సమ్మర్‌లో థియేటర్స్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ మూవీ, టైటిల్‌కు తగినట్టే “MEGA MASS BEYOND THE UNIVERSE” గా ఉండబోతోందని గ్లింప్స్ చెబుతోంది.

మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయే గ్రాండియర్, విజువల్ ట్రీట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ తో అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ చేస్తూ బర్త్‌డే సంబరాలను డబుల్ చేసుకున్నారు. హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి.

Updated Date - Aug 22 , 2025 | 09:48 AM