సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: ఎవర్రా ఈ కుర్రాడు.. రామ్ చరణ్ కి తమ్ముడా!

ABN, Publish Date - Dec 19 , 2025 | 03:04 PM

మొన్న జియో హాట్ స్టార్ ఈవెంట్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వయస్సుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు

Chiranjeevi

Chiranjeevi: మొన్న జియో హాట్ స్టార్ ఈవెంట్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వయస్సుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాగార్జునని యాంటీ ఏజింగ్ రీసెర్చ్ కి పంపాలని, ఆయన వయస్సు తిరుగుతుంది కానీ పెరగడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు మనవళ్లు పుట్టినా నాగార్జున మాత్రమే ఇంతే యంగ్ గా ఉంటాడని తెలిపాడు. ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ రీసెర్చ్ ని నాగ్ పైనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పైన కూడా చేయాలి. ఈయనకు కూడా వయస్సు పెరుగుతుందో.. తరుగుతుందో తెలియడం లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

సాధారణంగా 70 ఏళ్ళ వయస్సు ఉన్నవారు బయట ఎలా ఉంటారు.. వెన్ను నొప్పితో.. మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఇంట్లో ఉంటారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను పట్టాలెక్కించి షాక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం చిరు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీనికి ముందే పూర్తి చేసిన విశ్వంభర సైతం వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ రెండు కాకుండా బాబీ, శ్రీకాంత్ ఓదెల సినిమాలను కూడా పట్టాలెక్కించి చిరు పూర్తిచేసే పనిలో పడ్డాడు.

ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా ఫోటోషూట్స్ చేసి అందరిని అబ్బురపరుస్తూ ఉంటాడు మెగాస్టార్. తాజాగా చిరు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలలో చిరును చూసినవారెవ్వరూ కూడా ఆయనకు 70 ఏళ్లు అని అంటే నమ్మరు. ఆ స్వాగ్, స్టైల్.. బాసూ.. అదిరింది నీ లుక్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు అయితే.. ఎవర్రా ఈ కుర్రాడు.. రామ్ చరణ్ కి తమ్ముడులా కనిపిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.

నిజం చెప్పాలంటే చరణ్ పక్కన చిరు నిల్చుంటే తండ్రీకొడుకులు కన్నా అన్నదమ్ముల్లా ఉన్నారు అనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. ఈ వయస్సులో కూడా అంత అందాన్నీ మెయింటైన్ చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసున్నాయి. వయస్సు పెరిగినా.. తరిగినా చిరు స్టైల్ ని, స్వాగ్ ని మ్యాచ్ చేయడం ఎవరి వలన కాదని మెగా ఫ్యాన్స్ నొక్కి వక్కాణినిస్తున్నారు. మరి వచ్చే ఏడాది బాక్సాఫీస్ ని శంకర వరప్రసాద్ గారు ఎలా బంతాడేస్తారో చూడాలి.

Updated Date - Dec 19 , 2025 | 03:06 PM