Kodama Simham: మన మెగా కౌబాయ్.. థియేటర్లకు వస్తున్నాడు! ఇక రచ్చ రచ్చే
ABN, Publish Date - Oct 01 , 2025 | 08:03 AM
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం 'కొదమసింహం మరోమారు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం 'కొదమసింహం (Kodama Simham). చిరంజీవి. శ్రీదేవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'జగదేకవీరుడు-అతిలోకసుందరి' విడుద లైన సరిగ్గా మూడు నెల లకు అంటే 1990 ఆగస్టు 9న కొదమసింహం (Kodama Simham) విడు దలైంది. ఆ సమయంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉండడంతో ప్రేక్ష కులు ఈ సినిమాను బాగానే ఆదరించారు.
కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు (Kaikala Nageswara Rao) నిర్మించిన కొదమ సింహం' చిత్రానికి మురళీమోహనరావు (K. Murali Mohana Rao) దర్శకుడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధ (Radha), సోనమ్ (Sonam), వాణీ విశ్వనాథ్ (Vani Viswanath), బాలీవుడ్ నటుడు ప్రాణ్ నటించారు. మోహన్ బాబు (Mohan Babu) పోషించిన కామెడీ విలన్. పాత్ర 'సుడిగాలి' ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సత్యానంద్ (Satyanand) డైలాగ్స్ అందించగా పరుచూరి బ్రదర్స్ (Paruchuri Brothers) స్క్రీన్ ప్లే చేశారు.
అయితే.. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో 'ఈ కొదమసింహం' చిత్రాన్ని 4కెలోకి మార్చి, 5.1 డిజిటల్ సౌండింగ్ వంటి అదనపు హంగులు చేకూర్చి నవంబర్ 21న మళ్లీ విడుదల చేయనున్నారు. విజయదశమి సందర్భంగా చిత్ర నిర్మాత నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. సంగీత దర్శకత్వ ద్వయం రాజ్-కోటి (Raj–Koti ) స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి మరో హైలైట్.