సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mana Shankaravaraprasad Garu: మెగా విక్టరీ మాస్ సాంగ్ వచ్చేసిందిరోయ్

ABN, Publish Date - Dec 30 , 2025 | 04:45 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankaravaraprasad Garu).

Mana Shankaravaraprasad Garu

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara) జంటగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankaravaraprasad Garu). సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా కనిపిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఇండస్ట్రీ మొత్తం సంక్రాంతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి హిట్ అందుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో వస్తున్నాడు.

ఇప్పటికే రెండు పాటలతో అదరహో అదరహా అనిపించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ నుండి థర్డ్ సింగిల్ మంగళవారం గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో విడుదలయింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో శుభసూచకంగా ఈ పాటను రిలీజ్ చేయడం విశేషం!. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేమ్ లో వేసిన చిందులు అభిమానులకు అంబరమంటే ఆనందాన్ని సొంతం చేస్తున్నాయి... "మార్నింగ్ గ్రీన్ టీ... నైటయితే నైంటీ..." అంటూ మొదలయ్యే ఈ పాట యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది... భీమ్స్ సిసిరోలియో ట్యూన్స్ లో రూపొందిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రాయగా, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ నిర్వహించారు... ఈ పాటలో చిరంజీవి వెంకీని 'చంటి' అంటూ సంబోధించడం, వెంకీ బదులుగా 'బాసూ' అంటూ పిలవడం ఫ్యాన్స్ కు మరింత కిక్కునిస్తోంది.

టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ గుర్తుకు వస్తారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ఈ నలుగురు స్టార్స్ టాలీవుడ్ ను ఏలేస్తున్నారు. ఈ నాటికీ యంగ్ హీరోస్ తో పోటీగా సాగుతున్నవారున్నారు. అయితే ఇప్పటి దాకా ఈ నలుగురు హీరోల్లో ఎవరూ ఒకరితో ఒకరు కలసి నటించలేదు... ఆ ఫీట్ ను చిరంజీవి, వెంకటేశ్ ముందుగా చేయడం గమనార్హం! 'మన శంకరవరప్రసాద్ గారు'లో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు... ఇన్ సైడర్స్ టాక్ ద్వారా తెలిసిందేంటి అంటే - ఇందులో వెంకటేశ్ పాత్ర ఎంట్రీ నుండి ఎండ్ అయ్యేదాకా సినిమా ఓ రేంజ్ లో ఉంటుందట... అలా చిరు, వెంకీ ఇద్దరిపై రూపొందించిన సాంగ్ సినిమాకే ఎస్సెట్ కాగలదని వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Dec 30 , 2025 | 05:01 PM