సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi Shoot: కేరళలో పాట చిత్రీకరణ

ABN, Publish Date - Jul 20 , 2025 | 04:23 AM

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం...

మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (‘మెగా157-వర్కింగ్‌ టైటిల్‌)’ షూటింగ్‌ కేరళలో శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కేరళలోని అందమైన లోకేషన్లలో చిరంజీవి, నయనతారపై పెళ్లి నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘కొన్ని కీలకమైన ఘట్టాలను కూడా ఈ షెడ్యూల్‌లో షూట్‌ చేస్తున్నాం, ఈనెల 23 నాటికి ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంద’ని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Jul 20 , 2025 | 04:23 AM