సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమాకు ప్రత్యేకాకర్షణగా

ABN, Publish Date - Jun 20 , 2025 | 04:46 AM

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 157’- (వర్కింగ్‌ టైటిల్‌). నయనతార కథానాయిక. సాహు గారపాటి నిర్మిస్తున్నారు...

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెగా 157’- (వర్కింగ్‌ టైటిల్‌). నయనతార కథానాయిక. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలె ప్రారంభమైన మసూరి షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార కలయికలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా, ఈ షెడ్యూల్‌ ముగిసిందని, ఈ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకాకర్షణగా ఉండనున్నాయని మేకర్స్‌ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: తమ్మిరాజు, డీఓపీ: సమీర్‌ రెడ్డి

Updated Date - Jun 20 , 2025 | 04:46 AM