Chiranjeevi - Nayanthara: కేరళలో మెగా 157 చిత్రీకరణ.. సీన్‌ వైరల్‌

ABN , Publish Date - Jul 18 , 2025 | 08:30 PM

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది.

Chiranjeevi - Nayanthara

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా 157 (Mega 157) వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు అనిల్‌ సుంకర శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఇందులో ఓ సీన్‌ లీక్‌ అయింది. ప్రస్తుతం కేరళలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి వాళ్లు షూటింగ్‌ వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేసి వైరల్‌ చేశారు. కుటుంబ విలువలు, వినోదం ప్రధానంగా సాగే ఈ చిత్రమిది. కేరళలోని అలెప్పీలో చిరంజీవి, నయనతారలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అక్కడ చిన్న బోట్‌ లో ఈ ఇద్దరూ పక్కపక్కనే పెళ్లి దుస్తుల్లో కూర్చొని ఉండటం ఆ వీడియోలో కనిపించింది. ఓ బోట్‌ లో నుంచి వీళ్లు దిగి మరో చిన్న పడవ మీదికి వెళ్లడం, తర్వాత దానిపై వెళ్తూ షూటింగ్‌ చేయడం ఈ వీడియోలో ఉంది. చిరంజీవి, నయనతారపై ఈ సీన్‌ ఎలా తీస్తున్నారో చూడండంటూ ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోలో కనిపిస్తున్న రెండు పడవలకు బంతి పూలతో అలంకరించి ఉంది. 


చిరంజీవి ధోతీ, కుర్తా ధరించగా, నయన్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజులో క్రీమ్‌ కలర్‌లో కనిపిస్తున్నారు. ఆ దుస్తులు చూస్తే పెళ్లి సన్నివేశం తీస్తున్నట్లు తెలుస్తోంది. వీడియో పోస్ట్‌ చేసిన యూట్యూబర్‌ కూడా అది పెళ్లి సీనే అని వీడియోలో పేర్కొన్నాడు. కేరళలో ఓ పాటకు సంబంధించిందిని చిత్రీకరణ జరుగుతోందనీ, చిరంజీవి, నయనతార ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చేస్తున్నారని తెలిసింది. భాను మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. కేరళలో జరుగుతున్న ఈ షెడ్యూల్‌ జులై 23తో ముగియనుందని సమాచారం. కేరళ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత జులైలో కొద్ది రోజులు విరామం తీసుకుని.. ఆగస్టులో హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌ కోసం తిరిగి సిద్థమవుతారు. అక్టోబర్‌కు సినిమా పూర్తి చేసే దిశగా అనిల్‌ రావిపూడి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ALSO READ:
Tourist Family - Chhaava: చిన్న సినిమా.. పెద్ద విజయం.. మామూలు రికార్డ్ కాదిది

Kireeti Reddy: జూనియర్ ఎన్టీఆర్.. కిరీటికి అప్పుడే బిరుదు

Updated Date - Jul 18 , 2025 | 09:07 PM