సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Meena Sagar: అబ్బా.. మీనా కూతురుని చూశారా.. హీరోయిన్ కి మించి ఉందిగా

ABN, Publish Date - Dec 26 , 2025 | 03:27 PM

అందం, అమాయకత్వం కలబోసిన రూపం మీనా సాగర్ (Meena Sagar). బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన మీనా.. సీనియర్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.

Meena Sagar

Meena Sagar: అందం, అమాయకత్వం కలబోసిన రూపం మీనా సాగర్ (Meena Sagar). బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన మీనా.. సీనియర్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తరువాత హీరోయిన్ గా ఎదిగి టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారి నెంబర్ వన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన మీనా .. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాగర్ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహాం చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక మీనాకు ఒక్కగానొక్క కుమార్తె నైనికా.

తల్లి బాలనటిగా ఎలా అయితే అలరించిందో నైనికా కూడా బాలనటిగా మెప్పించింది. విజయ్ - అట్లీ కాంబోలో వచ్చిన తేరి సినిమాలో నైనికా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ కూతురిగా ఈ చిన్నదాని నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక తేరి తరువాత మీనా.. కూతురిని చదువుపైనే దృష్టి పెట్టేలా చేసింది. అంతా బావుంది అనుకొనేలోపు సాగర్ మరణించాడు. దీంతో మీనా, నైనికా ఒంటరివారు అయ్యారు.

భర్త మరణం తరువాత కూతురు కోసం మీనా మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టింది. ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా మీనా తట్టుకొని నిలబడింది. కూతురుని సింగిల్ మదర్ గా కష్టపడి పెంచుతుంది. ప్రస్తుతం నైనికా యుక్త వయస్సుకు వచ్చింది. తల్లి అందాన్ని పుణికిపుచ్చుకుని ఈ చిన్నారి ఎదుగుతుంది. మరో రెండేళ్లలో మీనా తన కూతురిని కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించనుందని టాక్ నడుస్తోంది. తాజాగా మీనా తన కూతురు నైనికాతో కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లికి మించిన అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి నైనికా తన ఎంట్రీ మొదట తెలుగులో ఇస్తుందో.. తమిళ్ లో ఇస్తుందో చూడాలి.

Updated Date - Dec 26 , 2025 | 03:28 PM