సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: సమస్యలకు పరిష్కారం చూపిస్తానని చిరు భరోసా ఇచ్చారు..

ABN, Publish Date - Aug 17 , 2025 | 09:11 PM

తెలుగు చిత్ర పరిశ్రమలో (TFI) సినిమా షూటింగ్‌లు బంద్‌ చేసిన సంగతి తెలిసిందే! కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఫెడరేషన్‌ నిర్మాతలతో చర్చలు జరుపుతోంది.

Chiranjeevi


తెలుగు చిత్ర పరిశ్రమలో (TFI) సినిమా షూటింగ్‌లు బంద్‌ చేసిన సంగతి తెలిసిందే! కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఫెడరేషన్‌ నిర్మాతలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఏ చర్చ ఫలించలేదు. ఆదివారం చిన్న నిర్మాతలంతా కలిసి చిరంజీవిని (chiranjeevi) కలిసి కష్టాలను వివరించారు. ఈ నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్‌ (natti kumar) మాట్లాడుతూ ‘చిన్న సినిమా కష్టాలను చిరంజీవికి వివరించాం. ఈ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. సోమవారం ఫెడరేషన్‌ సభ్యులతో మాట్లాడతానన్నారు. 2018లో 25ు చిన్న సినిమాలకు తగ్గిస్తామని చెప్పి అమలు చేయలేదు. ఏ రేట్లను పెంచిన చిన్న సినిమాకు 20ు తగ్గించాలని అప్పుడు చెప్పాం. సోమవారం ఫెడరేషన్‌ వాదన కూడా వింటానని చిరంజీవి చెప్పారు.  సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో నమస్కారానికి ప్రతినమస్కారం లేకపోయిన జగన్‌ మోహన్‌ రెడ్డితో  మాట్లాడారు చిరంజీవి. కొందరు ఇగోకి వెళ్ళారు.. అదెక్కడికో వెళ్ళింది. ఇప్పుడు చిన్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉంది. అందుకే చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరాం. చిరంజీవి గుడ్‌ న్యూస్‌ చెప్తానని మాటిచ్చారు. ఆయన ఏం చెబితే అది తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్‌ చెప్పింది’’ అని నట్టి కుమార్‌ చెప్పారు

 

Updated Date - Aug 17 , 2025 | 09:18 PM