సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mayukham: పూజా కార్యక్రమాలతో 'మయూఖం'

ABN, Publish Date - Aug 29 , 2025 | 05:49 PM

ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో రూపుదిద్దుకుంటున్న సినిమా 'మయూఖం'. వెంకట్ బులెమోని దర్శకత్వంలో శ్రీలత వెంకట్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.

సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్ పై శ్రీలత వెంకట్ (Srilatha Venkat) నిర్మిస్తున్న సినిమా 'మయూఖం' (Mayukham). వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా 'మయూఖం' రూపుదిద్దుకుంటోంది. దీనిని వెంకట్ బులెమోని (Venkat Bulemoni) డైరెక్ట్ చేస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రసాద్ లాబ్స్ లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి టీ సీరిస్ మ్యూజిక్ (T Series Music) కు చెందిన ప్రియాక మాన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ (RP Patnayak) కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ (Veera Sankar) ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యాక్టర్ రాంకీ, బ్యాంకింగ్ కమిటీ ఛైర్మన్ హరి గోవింద్, రెడ్ ఎఫ్.ఎం. మాజీ మార్కెట్ మేనేజర్ బద్రినాథ్, ఫోర్స్ మోటర్స్ సంస్థ ప్రతినిధులు శివకుమార్, మామ్ కంపెనీ సీఈవో రాహుల్, హీరో, నిర్మాత రాంకీ తదితరులు పాల్గొన్నారు.


అనంతరం డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ, 'మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసింది. అందులో ప్రస్తుతం 'రాజా సాబ్' మూవీ ఉంది. 'మనమే, అహింస, ఆడవాళ్లు మీకు జోహార్లు...' ఇలా దాదాపు 140 చిత్రాలకు మేము ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేశాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాం. మా సినెటేరియా మీడియా వర్క్స్ సంస్థ నుంచి 'మయూఖం' అనే భారీ పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాం. ఇదో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో 'తాల్' అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం' అని అన్నారు.

హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ, 'నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం' అని అన్నారు. తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన మేకర్స్ కు తన్మయి ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నటుడు నటరాజ్, ప్రశాంత్, తుషార్, అమర్ జిత్, దేవిల్, అయాన్, నటి సునీత తదితరులు పాల్గొన్నారు.

Also Read: Little Hearts: ట్రైలర్ తో అంచనాలు పెంచుకున్న 'లిటిల్ హార్ట్స్'

Also Read: Hero Vijay: ఇళయ దళపతిని ఇరుకున పెట్టే ప్రయత్నం

Updated Date - Aug 29 , 2025 | 05:49 PM