Nilakanta: సినిమా ఆఖరి 20 నిమిషాలు.. కట్టిపడేస్తుంది
ABN, Publish Date - Dec 28 , 2025 | 12:14 PM
చేయని తప్పుకు ఊరంతా నింద వేస్తే, ఒక యువకుడు తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడనే ఆసక్తికరమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘నీలకంఠ’.
చేయని తప్పుకు ఊరంతా నింద వేస్తే, ఒక యువకుడు తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు అనే ఆసక్తికరమైన ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘నీలకంఠ’ (Nilakanta). మాస్టర్ మహేంద్రన్ (Master Mahendran), నేహా పఠాన్ (Neha Pathan) జంటగా నటించారు. రాకేశ్ మాధవన్ (Rakesh Madhavan) దర్శకత్వంలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించారు. ఈ చిత్రం జనవరి 2న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా శ నివారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా ఆఖరి 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచి ఎమోషన్స్, ఫైట్స్, పాటలు ఉన్నాయి’ అని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందించాం, ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు చెప్పారు.