సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nilakanta: సినిమానే నా ప్రపంచం.. సినిమా తప్ప నాకేం తెలియదు

ABN, Publish Date - Dec 31 , 2025 | 05:35 PM

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా చేసిన తాజా చిత్రం ‘నీలకంఠ’.

Nilakanta

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మాస్టర్ మహేంద్రన్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం “నీలకంఠ”. ఈ సినిమాను శ్రీమతి ఎం. మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్లపై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మించారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా నటించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన “నీలకంఠ” తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు ఆది సాయికుమార్, ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌లో హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న ప్రేమ, సపోర్ట్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆది నాకు మంచి ఫ్రెండ్. ‘శంబాల’ హిట్‌తో ఆయన గర్వపడే విజయం అందుకున్నారు. ఆకాష్ ఈ ఈవెంట్‌కు రావడం చాలా హ్యాపీగా ఉంది. నాకు సినిమా మాత్రమే ప్రపంచం. పోటీ ఉందని చాలామంది చెబుతుంటారు, కానీ నేను నా ప్రయత్నాలు ఆపను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలన్నదే నా లక్ష్యం. ‘నీలకంఠ’ కోసం మా టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మా ప్రొడ్యూసర్లు చాలా ప్యాషనేట్ – సెట్ లేకుండా ఒక్కరోజు కూడా షూటింగ్ ఆగలేదు. డైరెక్టర్ కొత్త అయినా టాలెంట్ ఉన్నవాడు. యష్న సీత పాత్రలో ఆకట్టుకుంటుంది. జనవరి 2న థియేటర్స్‌లోకి వస్తున్న మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “మహేంద్రన్ ‘దేవి’ సినిమా నుంచే తన నటనతో మనకు దగ్గరయ్యాడు. ఆ సినిమాను నేను ఫ్యామిలీతో కలిసి ఎన్నిసార్లు చూసానో చెప్పలేను. అప్పటి నుంచే తన ప్రయాణం కొనసాగిస్తూ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మహేంద్రన్‌తో పాటు టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. “మహేంద్రన్ నాకు మంచి స్నేహితుడు. మేమిద్దరం చెన్నైలో పాండియన్ మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాం. అప్పట్లో సూర్య, కార్తి, ఆర్య గారు కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకునేవారు. మహేంద్రన్ చాలా మంచి నటుడు. ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి గారి చిన్ననాటి పాత్రలో అద్భుతంగా నటించాడు. ‘నీలకంఠ’ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావాలి. ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు, వేణుగోపాల్, డైరెక్టర్ రాకేష్, హీరోయిన్ యష్నతో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. జనవరి 2న థియేటర్స్‌లో సినిమా చూసి హిట్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూఇయర్” అని అన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 05:37 PM