సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

ABN, Publish Date - Jun 18 , 2025 | 07:16 PM

పెద్దికోసం పెద్ద రిస్కే చేస్తున్నాడు మెగాపవర్ స్టార్. అడగడమే తరువాయి.. దేనికైనా రెడీ అనేస్తున్నాడు. ఇప్పటికే అవతారం మొత్తం మార్చేసుకున్న ఈ హీరో.. ఒళ్లు దాచుకోకుండా కష్టపడిపోతుండటం అభిమానులని ఖుషీ చేస్తోంది.

peddi

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchibabu sana ) కాంబోలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ పెద్ది (Peddi) . రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రతి సీన్ విజువల్ ట్రీట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.... నెవర్ బిఫోర్ అనేలా మూవీని తీస్తున్నాడట. ఇప్పటిదాకా పెద్దగా అప్డేట్స్ లేవుకానీ.. ఇప్పుడు వరుసగా క్రేజీ న్యూస్ లు బయటకు వస్తుండటంతో ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన సిగ్నేచర్ షాట్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది. ఇప్పుడు అంతకు మించి ప్లాన్స్ తో బుచ్చిబాబు అడుగులు వేయడం ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారుతోంది.


పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ తన కెరీర్లో చేయని సాహసాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న తాజా షూటింగ్ షెడ్యూల్‌లో ఓ స్పెషల్ ట్రైన్ సెట్‌లో రామ్‌చరణ్‌తో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను టీమ్ చిత్రీకరిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాశ్ కొల్లా (Avinash Kolla) ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ సీన్ కోసం భారీ ట్రైన్ సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది. నబకాంత్ మాస్టర్ (Nabakanth Master) కొరియోగ్రఫీలో రామ్‌చరణ్ స్వయంగా సాహసోపేత పోరాటాలు చేస్తూ ఈ సీన్‌ను సినిమాకే హైలైట్‌గా మార్చబోతున్నారట. భారీ బడ్జెట్ తో సినీ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని రేంజ్ లో ఈ యాక్షన్ ఎపిసోడ్ రాబోతుందని... ఇది థియేటర్లలో చెర్రీ ఫ్యాన్స్ ను ఊపేస్తుందన్న టాక్ అప్పుడే మొదలైంది.

మరోవైపు ‘రంగస్థలం’ (Rangasthalam ) లో మెస్మరైజ్ చేసిన రామ్‌చరణ్ మరోసారి పెద్దిలో రగడ్, రా లుక్‌లో రచ్చ చేయబోతున్నారు. ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఇప్పటికే వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా ట్రెమండస్ రెస్పాన్స్‌తో హోరెత్తిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor)తో పాటు కన్నడస్టార్ శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) , జగపతిబాబు (Jagapathi Babu), దివ్యేందు శర్మ (Divyendu Sharma) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం నిర్మాత ప్రముఖ ఓటీటీ సంస్థతో వంద కోట్లకు పైగానే డీల్ సెట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న చరణ్ బర్త్ డే కానుకగా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొత్తానికి క్రేజీ అప్ డేట్స్ తో ఈ మూవీని ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంచేందుకు కూడా ప్లాన్ వేస్తున్నారట మేకర్స్.

Updated Date - Jun 18 , 2025 | 07:16 PM