Mario: 'మారియో' విడుదల ఎప్పుడంటే.. 

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:45 AM

‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందారు  కళ్యాణ్ జీ గోగణ (Kalyan G gogana) అయన నుంచి వస్తున్న కొత్త చిత్రం  ‘మారియో’ (Mario). 

Mario

‘నాటకం’, ‘తీస్ మార్ ఖాన్’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందారు  కళ్యాణ్ జీ గోగణ (Kalyan G gogana) అయన నుంచి వస్తున్న కొత్త చిత్రం  ‘మారియో’ (Mario).  'ఎ టర్బో-చార్జ్డ్ ర్యాంప్ రైడ్’  అన్నది  ట్యాగ్‌లైన్‌. అనిరుధ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్‌గా కమర్షియల్ జానర్‌తో పాటు కంటెంట్ ఓరియెంటెడ్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా, ఆద్యంతం వినోదాత్మకంగానూ ఉంటుందని చెప్పారు. 


సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు.

ALSO READ: Arjun Chakravarthy: చ‌ప్పుడు లేకుండా.. ఓటీటీకి వ‌చ్చేసిన రియ‌ల్ స్పోర్ట్స్ డ్రామా

Bigg Boss Telugu9: బిగ్ బాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మోడ్‌.. ట్విస్టులు, టాస్కులు, సర్ప్రైజ్ ఎంట్రీలు

Chiranjeevi: చిరంజీవికి కోర్టులో ఊర‌ట‌.. అనుమ‌తి లేకుండా పేరు వాడొద్ద‌ని ఆదేశాలు

Bhadrakali OTT: ఆరు వేల కోట్ల బ్రోక‌ర్‌.. ‘భద్రకాళి’ ఓటీటీకి వ‌చ్చేశాడు

Updated Date - Oct 24 , 2025 | 10:49 AM