సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thank You Dear: థాంక్యూ మనోజ్‌

ABN, Publish Date - Jul 23 , 2025 | 02:55 AM

ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, రేఖ నిరోషా ముఖ్య పాత్రల్లో తోట శ్రీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థాంక్యూ డియర్‌’. మహాలక్ష్మి ప్రొడక్షన్స్‌ బేనర్‌పై బాలాజీ రెడ్డి...

ధనుష్‌ రఘుముద్రి, హెబ్బా పటేల్‌, రేఖ నిరోషా ముఖ్య పాత్రల్లో తోట శ్రీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థాంక్యూ డియర్‌’. మహాలక్ష్మి ప్రొడక్షన్స్‌ బేనర్‌పై బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్‌ లాంచ్‌ చేశారు. ఈ చిత్రంలోని ‘చిక్కక చిక్కిన గుమ్మ’ అంటూ సాగే తొలి గీతాన్ని హీరో మంచు మనోజ్‌ ఆవిష్కరించారు. ఈ పాటను చిత్ర నిర్మాత బాలాజీ రెడ్డి రాయగా, సుభాష్‌ ఆనంద్‌ సంగీత సారథ్యంలో శ్రీచరణ్‌ ఆలపించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు ధనుష్‌ రఘుముద్రి, నిర్మాత బాలాజీ రెడ్డి, సంగీత దర్శకుడు సుభాష్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 02:55 AM