Anshu: బికినీలో.. మన్మథుడు అన్షు అందాల విందు
ABN , Publish Date - Jul 13 , 2025 | 12:49 PM
మన్మథుడు సినిమాలో మృదు మధుర స్వరం, అమాయకత్వంతో ఆకట్టుకున్న అన్షు ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తోంది.
'తాగితే కదా.. నచ్చుతుందో లేదో తెలిసేది... అంటూ మన్మథుడు (Manmadhudu) సినిమాలో మృదు మధుర స్వరం, అమాయకత్వంతో ఆకట్టుకున్న అన్షు (ANSHU) ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాగార్జున మన్మధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న ఈ నటి ఆ చిత్రం తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర, తమిళంతో ప్రశాంతో ఓ సినిమా తెలుగులో గెస్ట్ పాత్రల్లో మాత్రమే నటించిన ఈ ముద్దుగుమ్మ ఆపై రీర్ ఊపందుకుంటున్న సమయంలోనే పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి పోయింది.
ఇటీవల సందీప్ కిషన్, రావు రమేశ్ మజాకాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ మూవీ అంతగా విజయవంతం కాకపోవడంతో ఏవైనా ఛాన్సులు వస్తే వస్తా అన్నట్లు విదేశాలకు తిరిగి వెళ్లిపోయింది. అయితే పెళ్లై ఇద్దరు పిల్లలున్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.
తాజాగా తన భర్త , పిల్లలతో కలిసి దుబాయ్ ట్రిప్‌కు వెళ్లిన ఈ భామ అక్కడ ఓ ఖరీదైన హోటల్‌లో బస చేసి, స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతూ అందాలు ఆరబోస్తూ అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది.
ఆ ఫొటోలు చూసిన వారంతా అన్షును ఇంత హాట్‌గా ఎన్నడూ చూడలేదంటు కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోనూ ఎప్పుడూ అందాల ప్రదర్శణ చేయని ఈ బ్యూటీ ఇప్పుడేంటీ ఇంతగా గ్లామర్ ట్రీట్ ఇస్తుందంటూ అనుకుంటున్నారు.