Anshu: బ్యాక్‌లెస్‌గా.. మన్మధుడు భామ! కుర్ర హీరోయిన్లు జంకేలా ఉన్నారుగా
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:44 PM
మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ముంబైలో బ్యాక్‌లెస్ చీర ఫోటోషూట్‌తో సంచలనం సృష్టించింది. 2
నాగార్జున మన్మధుడు (Manmadhudu) భామ అన్షు (Anshu Ambani)మరోసారి రెచ్చిపోయింది. అప్పుడెప్పుడో 20 సంవత్సరాల క్రితం రెండు మూడు సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ సడన్గా పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయింది. ఆపై అన్షుకు ఇద్దరు పిల్లలు పుట్టడం వారికి 15 సంవత్సరాల వయసు కూడా రావడం చకచకా అయిపోయాయి. తిరిగి ఈ సంవత్సరం సందీప్ కిషన్ మజాకా సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సినిమాలు చేతిలో లేకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది.
పైపెచ్చు పద్దతైన, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన అన్షు ఇప్పుడు గేర్ మార్చి వీక్షకులకు షాక్ ఇస్తుంది. అందాల గేట్లకు తెర లేపుతూ హీరోయిన్లు కూడా పనకి రారు అనేలా అంగాంగ ప్రదర్షణలతో ఖంగుతినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు దుబాయ్‌లో విలాసవంతమైన రిసార్ట్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసిన ఈ సుందరి నిత్యం వేసి బికినీ వేయకుండా చూసే వారికి కనులవిందు గావించింది.
ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించిన ఈన్షు ఇటీవలే ముంబైలో ల్యాండ్ అయి ఫొటోషూట్లతో కాక రేపింది. ఈ నేపథ్యంలోనే ఇదివరకు ఎన్నడు చేయని విధంగా చీర కట్టి బ్యాక్‌లెస్‌గా షూట్ చేయించి అందరిని షాక్ గురి చేసింది. సదరు వీడియోను తాజాగా అన్షు ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. దానిని చూసిన ఆమె ఫ్యాన్స్, ఇతర తెలుగు నెటిజన్స్ అసలు తమ కండ్లను తామే నమ్మలేక పోతున్నారు.
అన్షుకి ఏమైంది.. మరి ఈ స్థాయిలో మారి పోయింది. పెళ్లయ్యాక ఇంత గ్లామర్ షో అవసరమా.. ఒక వేళ ఛాన్సుల కోసమే అయితే సైడ్ క్యారెక్టర్లే వస్తాయి కానీ హీరోయిన్ రోల్స్ రావు కదా అంటూ విమర్శలు చేస్తున్నారు. అంతమాత్రం దానికి యువ కథానాయికలు కూడా జంకేలా ఈ వయసులో, రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ షూట్లు చేయడం అవసరమా అంటూ హితవు పలుకుతున్నారు.