Manisharma: మ్యూజిక్ తో మెలోడీ బ్రహ్మ మాయ
ABN, Publish Date - Jul 11 , 2025 | 06:42 PM
ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు వింటే సినీ ఫ్యాన్స్ మదిలో ఆనంద రాగాలు పలికేవి... అంతలా అలరించిన మణిశర్మ బర్త్ డే జులై 11న... ఈ సందర్భంగా మణిశర్మ బాణీల పవరేంటో ఓ సారి మననం చేసుకుందాం...
దాదాపుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరి అభిమానులనూ ఆనందడోలికల్లో ఊపేసిన సంగీత దర్శకుడు మణిశర్మ(Mani Sharma) అనే చెప్పాలి... ఆయన కంటే ముందు ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ సినీ ఫ్యాన్స్ అందరినీ తమ ట్యూన్స్ తో మురిపించారు... ఆ స్థాయిలో మళ్ళీ క్రేజ్ సంపాదించిన ఘనతను మణిశర్మనే దక్కించుకున్నారు... పాతికేళ్ళ కిందట మణిశర్మ ట్యూన్స్ తో పలువురు టాప్ స్టార్స్ బ్లాక్ బస్టర్స్ చూశారు... ఇక వారి ఫ్యాన్స్ ఆనందంతో చిందులు వేశారు... ఈ నాటికీ మణిశర్మ పంచిన మధురాన్ని మననం చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారెందరో...
ఆరంభంలో కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం ఇస్తూ, మరికొన్ని సినిమాల్లో ఒకటి రెండు పాటలు చేస్తూ సాగారు మణిశర్మ... ఆయనకు సోలో మ్యూజిక్ డైరెక్టర్ గా డి.రామానాయుడు తమ 'సూపర్ హీరోస్' (Super Heroes) తో అవకాశం కల్పించారు... ఆ పై చిరంజీవి (Chiranjeevi) 'బావగారూ... బాగున్నారా'(Bavagaru Bagunnara)కు మణిశర్మ బాణీలు కట్టి అలరించారు... దానిని మించి చిరంజీవి 'చూడాలనివుంది' (Choodalani Vundi)ఆడియోను సక్సెస్ చేశారు మణిశర్మ... ఈ సినిమా ఘనవిజయంతో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ మణిశర్మ వెంటపడ్డారు... అందరికీ తన బాణీలతో ఆనందం పంచారు మణి.
మణిశర్మ స్వరాల్లో చిరంజీవి "చూడాలనివుంది, ఇంద్ర (Indra), ఠాగూర్ (Tagore)" చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి... అలాగే బాలకృష్ణ "సమరసింహారెడ్డి (Samarasimha Reddy), నరసింహనాయుడు (Narasimha Naidu ) , లక్ష్మీనరసింహా (Lakshmi Narasimha)" సూపర్ డూపర్ హిట్స్ చూశాయి... ఇక మహేశ్ కు "ఒక్కడు(Okkadu), అతడు (Athadu), పోకిరి(Pokiri)" వంటి మ్యూజికల్ హిట్స్ అందించారు మణి... ఈ ముగ్గురు స్టార్స్ కే కాకుండా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), జూనియర్ యన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి యంగ్ స్టార్స్ కూ అదరహో అనిపించే సంగీతం సమకూర్చారు మణిశర్మ... ఇప్పటికీ తన దరికి చేరిన అవకాశాలను వినియోగించుకుంటూ సాగుతున్నారు మణి... తాజాగా 'కన్నప్ప (Kannappa)'లో "ఆకాశ వీధిలో..." (Aakasha Veedhi lo...) అంటూ సాగే పాటకు స్వరాలు సమకూర్చారు మణి... మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ సినిమాలకూ మణిశర్మ తనదైన స్వరకల్పనతో అలరించారు... మణి అసోసియేట్స్ గా పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), థమన్(Thaman), హారిస్ జైరాజ్ (Harris Jayaraj) నేడు తమదైన పంథాలో పయనిస్తున్నారు... మణి తనయుడు మహతీ స్వరసాగర్ (Mahati Swarasagar) కూడా తండ్రి బాటలోనే పదనిసలు పలికిస్తున్నారు... ఏది ఏమైనా మణి బాణీలు ఈ నాటికీ ఆ నాటి ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉండడం విశేషం!