Kannappa: అంతా విష్ణుమయం.. ‘కన్నప్ప’ మేకింగ్ వీడియో రిలీజ్!
ABN, Publish Date - May 08 , 2025 | 10:36 AM
డైనమిక్ హీరో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తోన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ చిత్రం నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
మంచు విష్ణు (Vishnu Manchu) కథానాయకుడిగా నటిస్తోన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం ‘కన్నప్ప’.(Kannappa Movie). ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ జూన్ 27 రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్స్ మంచి వ్యూస్ దక్కించుకున్నప్పటీకీ బాగా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఆపై రిలీజ్ చేసిన శివ శివ శంభో పాటతో ఒక్కసారిగా ఈ సినిమాపై మంచి అటెన్షన్ రావడంతో ప్రశంసలు సైతం దక్కాయి. సినిమా విడుదల దగ్గర పడుతుండంతో విష్ణు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో మే 8 నుంచి అమెరికాలో పర్యటించి కన్నప్ప చిత్రం ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నాడు.
అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ప్రధాన తారాగణానికి సంబంధించి ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ విడుదవల చేసిన మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేలా ఉంది. పూర్తిగా న్యూజిలాండ్‌లోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విజువల్స్ చూస్తుంటే మైండ్‌బ్లోయింగ్‌లా ఉన్నాయి. సినిమా రూపొందించే విషయంలో వారు పడిన కష్టం తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh kumar singh) స్థానంలో మంచు విష్ణునే అంతా తానై చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంకా మాట్లాడుకుంటే విష్ణునే సినిమాను డైరెక్ట్ చేసినట్లు అనిపిస్తోంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్ బాబు (Mohanbabu), అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohanlal), శరత్ కుమార్ (Sarathkumar), కాజల్ అగర్వాల్. ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) వంటి భారీ తారాగణం ఉంది. అదే విధంగా విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కూతుర్లు అరియానా, వివియానా ఓ నృత్యరూపక పాటలో కనిపించనున్నారు.