Manchu Family: మంచు వారి ఇంట.. దీపావళి సెలబ్రేషన్స్
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:43 PM
మంచు మోహన్ బాబు (Mohan Bab) కుటుంబ సభ్యులు మంచు విష్ణు (Manchu Vishnu ), నలుగురు పిల్లలు అంతా కలిసి దివాళీ సంబురాలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు.
దీపావళి పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇక సినిమా తారల విషయానికి వస్తే.. పండుగ హంగామా, సెలబ్రేషన్స్ అంతకుమించి అనేలా ఉంటాయి.
దివాళి (Diwali,)పండుగరోజు మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో తోటి స్టార్ హీరోలు నాగార్జున, వెంకటేశ్‌లతో కలిపి జరుపుకుంటే.. అల్లు వారి కుటుంబ సభ్యులంతా ఇంట్లో కలిసి వైభవంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అదే కోవలో ఓ రోజు ఆలస్యంగా కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు (Mohan Bab) కుటుంబ సభ్యులు మంచు విష్ణు (Manchu Vishnu ), నలుగురు పిల్లలు అంతా కలిసి దివాళీ సంబురాలను అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఒ రోజు ఆలస్యంగా ఈ రోజు (మంగళవారం) బయటకు వచ్చాయి.
తాజాగా వచ్చిన ఈ ఫొటోలో మంచు ఫ్యామిలీ ఇంటిల్లిపాది కనిపించి వీక్షకులకు కనువిందు చేశారు. అయితే వీరిలో మంచు మనోజ్ ఒక్కడే మిస్ అవడంతో ఒకింత వెలితిగా ఉన్నట్టు అనిపించింది. ప్రస్తుతం ఈ మంచు వారి దిపావళీ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ అభిమానుల మనసులు దోచుకుంటున్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరి.