Mohan Babu And Supreme Court: మోహన్ బాబుకు.. సుప్రీంలో భారీ ఊరట

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:44 AM

ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత, శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Mohan Babu And Supreme Court

ప్రముఖ సినిమా నటుడు, నిర్మాత, శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మంచు మోహన్ బాబు (Mohan Babu)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. 2019లో ఆయన ఎన్నికల కోడును ఉల్లంఘించారంటూ ఏపీ పోలీసులు ఆయనపై నమోదైన చేసిన‌ కేసును సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. తన విద్యాసంస్థలకు పీజు రీయింబర్స్. మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై విద్యార్థులతోపాటు మంచు కుటుంబం ధర్నాకు దిగింది. అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆయనతో పాటు కుమారులు విష్ణు, మనోజ్, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే 2021లో పోలీసులు చార్జిషీట్‌ను దాఖలు చేయ‌గా దానిని కొట్టేయాలని కొరుతూ మోహన్ బాబు సుప్రీంను ఆశ్రయించగా జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం నిరాకరించింది. విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో తిరుపతి మెజిస్ట్రేట్ కోర్ట్‌లో విచారణకు వెళ్ల‌కుండా మినహాయింపు ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంలో కోర‌గా దానికి కూడా నాడు ధర్మాసనం అంగీక‌రించ‌క పోగా త‌ప్ప‌క విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఇన్నాళ్ల‌కు ఇప్పుడు ఆ ప్రోసీడింగ్స్ అన్నింటినీ కొట్టివేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. దీంతో మోహ‌న్‌బాబు (Mohan Babu)కు భారీ ఉప‌శ‌మ‌నం అభించిన‌ట్లైంది.

Updated Date - Aug 01 , 2025 | 10:44 AM