Manchu Mounika: స్టేజీ పైనే క‌న్నీళ్లు పెట్టిన.. మంచు మనోజ్ భార్య మౌనిక

ABN , Publish Date - Nov 05 , 2025 | 08:36 AM

మన మీద నమ్మకం ఉంచిన వారి చేయి ఎప్పుడూ వదలకండి అని మంచో మనోజ్‌ చెప్పారు.

mounika

కొత్త జంట అఖిల్‌, తేజస్విని హీరోహీరోయిన్లుగా నటించిన నూత‌న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai). విరాట‌ప‌ర్వం, నీది నాది ఒకే క‌థ వంటి సెన్సిబుల్ చిత్రాల డైరెక్ట‌ర్ వేణు ఉడుగల ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌తో క‌లిసి ఈ సినిమా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, నందిపాటి వంశీ నవంబర్‌ 21న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు. ఈక్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం ఈ సినిమా నుంచి.. ‘రాంబాయి నీ మీద నాకు మనసాయెనే’ (Rambai Neemeedha Naku) అంటూ సాగే రొమాంటిక్ మెలోడీ పాట‌ను ఆవిష్క‌రించారు. ఈ వేడుకకు మంచు మనోజ్ (Manchu Manoj) తన సతీమణి మౌనిక (Mounika) తో కలిసి హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రేమ కథను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర‌య్యారు.


ఈ ప్రపంచంలో తారతమ్యాలు లేనిది ప్రేమ ఒక్కటే. ప్రేమ పుడితే అంతే. ‘రాంబాయి నీ మీద నాకు’ పాటలోని ‘రాజ్యమేదీ లేదుగానీ రాణిలాగా చూసుకుంటా’ అనే లైన్‌ నాకు చాలా దగ్గరగా అనిపించింది. నేను మౌనికాకు కూడా అదే మాట చెప్పా..‘నాకేమీ రాజ్యాలు లేవు, సినిమాలు కూడా తాత్కాలికంగా చేయట్లేదు. కానీ మళ్లీ నటిస్తా.. కష్టపడతా.. జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటా.. నన్ను నమ్ముతావా జీవితాంతం నిన్ను రాణిలా చూసుకుంటా’ అని. ఆమె నన్ను నమ్మింది నాతో వ‌చ్చింది. ఎవ‌రైనా మన మీద నమ్మకం ఉంచిన వారి చేయి ఎప్పుడూ వదలకండి” అని మనోజ్‌ చెప్పారు.

అయితే.. ఆ పాట, అక్క‌డి వారి మాట‌లు వింటూ మంచు మనోజ్ భార్య మౌనిక స్టేజీ పైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధ‌ఙంచిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది. ‘రాంబాయి నీ మీద నాకు’ పాటకు మిట్ట‌ప‌ల్లి సురేంద‌ర్ (Mittapally Surendar) సాహిత్యం అందించ‌గా సురేశ్‌ బొబ్బిలి (Suresh Bobbili) స్వరపరిచారు.అనురాగ్ కుల‌క‌ర్ణి (Anurag Kulkarni), జ‌య‌శ్రీ ప‌ల్లెం (Jayasri Pallem) తమ మధుర గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ప్రేమలోని సున్నితమైన భావాలను గ్రామీణ వాతావరణంలో చూపించే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Updated Date - Nov 05 , 2025 | 08:36 AM