Manchu Manoj: డేవిడ్ రెడ్డి.. అంటున్న మంచు మనోజ్! హిస్టారికల్ యాక్షన్ మూవీ
ABN, Publish Date - Aug 06 , 2025 | 11:35 AM
తెలుగు సినీ పరిశ్రమలో పరో ఆసక్తికరమైన చిత్రం తెర మీదకు వస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమలో పరో ఆసక్తికరమైన చిత్రం తెర మీదకు వస్తోంది. తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందనుంది. ఇందుకు సంబంధించి తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పనిలో పనిగా డేవిడ్ రెడ్డి (David Reddy) అంటూ సినిమా టైటిల్ సైతం రివీల్ చేశారు. ఈ సంవత్సరంతో హీరోగా 21 ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న మనోజ్ యాదృశ్చికంగా ఇప్పుడు నటిస్తోన్న చిత్రం 21 వది కావడం విశేషం.
డైలాగ్ కింగ్, వెటరన్ యాక్టర్ మోహన్ బాబు (Mohan Babu) గారి కుమారుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన, చిన్నప్పుడే బాలనటుడిగా తన తొలి చిత్రాన్ని చేశాడు. ఆపై 2004లో దొంగ దొంగది చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా కెరీర్ స్టార్ చేసి తనదైన స్టైల్, ఎనర్జీ, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించడంలో మాంచి పేరు తెచ్చుకున్నారు. ఆపై బిందాస్, వేదం, పోటుగాడు, కరెంట్ తీగ, ఒక్కడు మిగిలాడు వంటి విభిన్నమైన చిత్రాల ద్వారా తాను కమర్షియల్, ఎమోషనల్, యాక్షన్ పాత్రలను సమర్థవంతంగా పోషించగల నటుడని నిరూపించుకున్నారు.
గడిచిన ఐదారేండ్లుగా వివాహాం, ఇతర పర్సనల్ సమస్యలతో సినిమాలకు విరామం ఇచ్చిన ఆయన ఇటీవల భైరవం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఇదిలా ఉండగానే మిరాయ్ అనే చిత్రంలోనూ త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన 21వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
డేవిడ్ రెడ్డి (David Reddy) అనే ఓ విభిన్న టైటిల్‌తో తెరకెక్కుతన్న ఈ సినిమా 1897, 1922 సంవత్సరాల మధ్య బ్రటీష్ కాలం నేపథ్యంలో సాగనుండగా హిస్టారికల్, హై ఓక్టేన్ యాక్షన్ జానర్‌లో సినిమా ఉండనుంది. మద్రాస్ ప్రెసిడోన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి బ్రిటీష్ వారిని గడగడలాడించిన రెబలీయన్ వ్యక్తి కథగా ఈ సినిమా ఉండనుంది. హనుమా రెడ్డి (Hanuma Reddy Yakkanti) యక్కంటి ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తుండగా వెల్వట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ (VelvetSoulMotionPictures Banner)పై మోత్కూరి భరత్ (Motukuri Bharath), నల్లగంగుల వెంకట్ రెడ్డి (Nallagangula Venkat Reddy) నిర్మిస్తున్నారు.