Manchu Manoj: మంచు మనోజ్ కిడ్నాప్.. ఎవరు చేశారు
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:47 PM
ఏంటి.. మంచు మనోజ్(Manchu Manoj) ని కిడ్నాప్ చేశారా.. ? ఎవరు.. ? ఏమైంది.. ? అని కంగారుపడకండి. మనోజ్ కిడ్నాప్ అవ్వడం నిజమే.. కానీ, అది సీరియస్ కిడ్నాప్ కాదు.
Manchu Manoj: ఏంటి.. మంచు మనోజ్(Manchu Manoj) ని కిడ్నాప్ చేశారా.. ? ఎవరు.. ? ఏమైంది.. ? అని కంగారుపడకండి. మనోజ్ కిడ్నాప్ అవ్వడం నిజమే.. కానీ, అది సీరియస్ కిడ్నాప్ కాదు. ప్రమోషన్ కిడ్నాప్. అదేంటి.. అర్ధం కాలేదు అని అంటారా. ఈ మధ్య ఈటీవీ విన్ నుంచి మంచి మంచి కథలు వస్తున్న విషయం తెల్సిందే. బడ్జెట్ తక్కువ.. కథ ఎక్కువ ఉన్న సినిమాలను రిలీజ్ చేస్తూ విజయం వైపు దూసుకుపోతుంది. అందులో భాగంగా ఈ మధ్యనే రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) అనే చిన్న సినిమా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అఖిల్ ఉద్దేమరి, తేజస్వి రావు జంటగా సాయిలు దర్శకత్వం వహించిన రాజు వెడ్స్ రాంబాయి రియల్ స్టోరీ అని తెలిసి ప్రేక్షకులు మరింత ఆదరిస్తున్నారు.
ఇక ఈ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మంచు మనోజ్ కూడా ఒక చెయ్యి వేశాడు. ఈ సినిమాకు మంచు మనోజ్ తన వాయిస్ ను అందిస్తున్నాడు. ఆ డబ్బింగ్ చెప్పడం కోసమే మనోజ్ ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో మనోజ్ మాట్లాడుతూ.. ' మూడు నాలుగురోజులు కామాఖ్యా గుడికి వెళ్లి, తిరిగి తిరిగి వచ్చి అర్ధరాత్రి పడుకుంటే.. నన్ను కిడ్నాప్ చూసి స్టూడియోకి తీసుకొచ్చారు. నన్ను కిడ్నాప్ చేసింది సాయి గారు. ఆయన కనిపించడం లేదు. ఆన్ గ్రౌండ్ కిడ్నాప్ చేసింది నితిన్ గారు. బాపినీడు గారు ఇమ్మిడియట్ గా చెక్ రిలీజ్ చేయండి. లేకపోతే నేను హర్ట్ అవుతాను.. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఏపీ అండ్ తెలంగాణలో ' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.